అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని రాయపూడి ఏపీసిఆర్డీఏ ప్రధాన కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏపీ సిఆర్డీఏ సిబ్బంది కోసం బుధవారం, 2026 సెప్టెంబర్ 16న ఉచిత వైద్య శిబిరం & అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో లతా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, సూర్యారావుపేట, విజయవాడకు చెందిన వైద్య బృందంలోని డా. ఎం. వెంకట్, డా. కాంచన రాజ్, డా. శివతేజ, ఇతర వైద్య సిబ్బంది APCRDA అధికారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు …
Read More »Daily Archives: September 16, 2026
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలించిన ఏడీసీ సీఎండీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా రాజధాని అమరావతి ప్రముఖ ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి ఈ నెల 23న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనున్నందన అక్కడ జరుగుతున్న రోడ్డు-రవాణా ఏర్పాట్లను బుధవారం అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి డి.లక్ష్మీపార్థసారథి వారు పరిశీలించారు. ముఖ్యంగా ఈ-3, ఎన్-14 కూడలి నుంచి వేదిక వద్దకు చేరుకునే మార్గాన్ని ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. సీడ్‌యాక్సెస్ రోడ్డు నుంచి సీఎం కాన్వాయ్ నేరుగా ఎల్.వి.ప్రసాద్ …
Read More »చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి – కిలారి రాజేష్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో మూడో రోజు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారి రాజేష్ ప్రత్యేకంగా పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని, ప్రజలకు సుభిక్షం కలగాలని కిలారి రాజేష్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ పాల్గొన్నారు.
Read More »చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి – విఘ్నేశ్వరుడిని ప్రార్థించిన బుచ్చి రామ్ ప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో మూడో రోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. బుచ్చి రామ్ ప్రసాద్ పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏ.వి. రమణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని …
Read More »పల్లెల నిండుగ అభివృద్ధి పండగ
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దార్శనికత్వంలో మారిన గ్రామీణాంధ్ర రూపురేఖలు -రెండు దశల్లో గ్రామాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు -రెండున్నరేళ్లలో 10 వేల కి.మి బీటీ, 9,600 కి.మి. సీసీ రోడ్ల నిర్మాణం -1,000 కిలోమీటర్లకు పైగా గిరిజన గ్రామాలకు అడవితల్లి బాటలు -అన్నదాతకు అండగా 1.15 లక్షల పంట కుంటలు -గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు -పాడి రైతు కోసం 38 వేల మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు -రెట్టించిన ఉత్సాహంతో …
Read More »పాడైన మాంసం.. అపరిశుభ్ర వంటగది
-కుంభకర్ణ రెస్టారెంట్ వంటగది తాత్కాలిక మూసివేత -ఐపీఎం డైరెక్టర్ అరుణ్‌బాబు స్వయంగా తనిఖీ.. -6 కిలోల పాడైన ఆహారం ధ్వంసం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఫ్రీజర్‌లో పాడైన చికెన్, మటన్, తందూరీ చికెన్, కబాబ్‌లు నిల్వ ఉంచడం.. మాంసం, చికెన్ రక్తపు మరకలతో వంటగది అపరిశుభ్రంగా ఉండటం వంటి తీవ్ర లోపాలు బయటపడటంతో మంగళగిరి కాజా టోల్‌ప్లాజా సమీపంలోని కుంభకర్ణ మల్టీ క్యూజీన్ ఫ్యామిలీ రెస్టారెంట్ వంటగదిని అధికారులు తాత్కాలికంగా మూసి వేయించారు ఐపీఎం (ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్) డైరెక్టర్ అరుణ్‌బాబు …
Read More »ప్రతి దశలోనూ.. రోగి భద్రత
-ఎన్‌సీడీ ద్వారా వ్యాధుల గుర్తింపు.. ‘సంజీవని’తో నిరంతర వైద్యం -మందుల భద్రత, సురక్షిత వైద్య విధానాలకు ప్రాధాన్యం -సెప్టెంబరు 17న ప్రపంచ రోగి భద్రతా దినోత్సవం -ఆస్పత్రుల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు -మంత్రి సత్యకుమార్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోగికి వైద్యం అందించడం ఎంత ముఖ్యమో.. ఆ వైద్యం వల్ల ఎలాంటి హాని కలగకుండా చూడటం కూడా అంతే ముఖ్యమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, సకాలంలో చికిత్స అందించడం, …
Read More »‘సేవా సంకల్ప్ అభియాన్’తో రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలు
-అక్టోబరు 17 వరకు నిర్వహణ -కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి -అధికారులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ శిబిరాల్లో ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య …
Read More »హాస్టళ్లలో పారిశుద్ధ్య లోపాలపై నోటీసులు – సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో హాస్టళ్లలో పారిశుద్ధ్య ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణ, వాణిజ్య లైసెన్సులపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 23వ డివిజన్ సూర్యారావుపేట ప్రాంతంలో బుధవారం హాస్టళ్లలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో రెండు హాస్టళ్లలో పారిశుద్ధ్య లోపాలను అధికారులు గుర్తించారు. ఒక హాస్టల్‌లో మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించకపోవడాన్ని, మరో హాస్టల్‌లో వంటగదిలో పరిశుభ్రత ప్రమాణాలు సక్రమంగా పాటించకపోవడాన్ని గుర్తించి, సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు. హాస్టళ్లలో …
Read More »పురపాలక ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలి
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో రానున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో డివిజన్ల సంఖ్యను 86కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ల వారీగా …
Read More »
Prajavartha Online Telugu News