-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో స్వచ్ఛత సేవా కార్యక్రమంపై శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, సెప్టెంబర్ 17, 2026 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు నిర్వహించనున్న స్వచ్ఛత సేవా కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నెల …
Read More »Daily Archives: September 16, 2026
స్వర్గపురిలో పచ్చదనం, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం
-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్గపురిలో పచ్చదనం పెంచి, పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. బుధవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కృష్ణలంకలోని స్వర్గపురిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా స్వర్గపురిలోని మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్లు, స్నానపు గదులు తదితర సౌకర్యాలను కమిషనర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్వర్గపురిలో వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలని ఆదేశించారు. …
Read More »విద్యుత్ శాఖలో ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
-కారుణ్య నియామకాల ద్వారా కూటమి ప్రభుత్వంలో 389 మందికి ఉద్యోగాలు -నేడు 25 మందికి ఏపీసీపీడీసీఎల్ లో కారుణ్య నియామకం కింద ఉద్యోగ నియామకాలు -రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాలు, విద్యుత్ రంగంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. స్థానిక గుణదలలోని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ …
Read More »వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, పర్యావరణహితంగా జరుపుకోవాలి – ఎంపీ చిన్ని
-విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44, 45వ డివిజన్లలో వినాయక మండపాలను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి సందర్భంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 44, 45వ డివిజన్లలో ఏర్పాటు చేసిన వివిధ వినాయక మండపాలను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, వినాయకుని ఆశీస్సులు పొందారు.విజయవాడ నగరం మొత్తం వినాయక చవితి వేడుకలతో సందడిగా మారిందని ఎంపీ చిన్ని అన్నారు. ఎటు చూసినా …
Read More »ఏపియుఐఎయంయల్ ప్రతినిధులతో సమన్వయ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో అభివృద్ధి చేయనున్న రోడ్డు కారిడార్లు మరియు జంక్షన్లను పట్టణ ప్రణాళిక,ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏపియుఐఎయంయల్ ప్రతినిధులు క్షేత్రస్తాయిలో పర్యటించి, అడ్డంకులు తొలగించి త్వరితగతిన పనులు ప్రారంభించుటకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ నందు పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ అధికారులు మరియు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ (ఏపియుఐఎయంయల్) ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. …
Read More »కౌన్సిల్ సమావేశ మందిరంలో అభినందన సభ, ప్రశంసా సర్టిఫికెట్ల పంపిణీ
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నవ గుంటూరులో భాగంగా ఈ నెల 11వ తేదీన చేపట్టిన గ్రీన్ గణేష్ కార్యక్రమంలో 55 పాఠశాలల నుండి 25 వేల మంది విద్యార్ధులు చేసిన మట్టి విగ్రహాల తయారీకి నగర ప్రజలు అనూహ్యంగా స్పందించి, వినాయక చవితినాడు సుమారు 50 శాతం మట్టి విగ్రహాలను పూజించడం ఆనందంగా ఉందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అన్నారు. గ్రీన్ గణేష్ కార్యక్రమం విజయవంతంలో భాగస్వాములైన వివిధ విద్యా సంస్థలు, అధికారులు, సిబ్బందికి …
Read More »వినాయక చవితి సందర్భంగా ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో తెనాలిలో ఘనంగా అన్నదాన కార్యక్రమం
తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని తెనాలి ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ ఆధ్వర్యంలో, తెనాలి టౌన్ నాయకురాలు యేనుముల ప్రీతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణంలోని పాండురంగపేట 26వ వార్డులో, షాదీఖానా వెనుక ఉన్న శ్రీ శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ట్రాన్స్‌జెండర్ నాయకురాలు యేనుముల ప్రీతి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా ఈ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యేనుముల …
Read More »టెట్ సిలబస్ సమీక్షకు కమిటీ యూటీఎఫ్ ప్రతినిధులతో ఎన్సీటిఈ అధికారుల భేటీలో వెల్లడి…
న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయ అర్హత పరీక్ష సిలబస్, అర్హత మార్కులు, పరీక్షా విధానాన్ని సమీక్షించి అవసరమైన మార్పులు సూచించడానికి ఉపసంఘాన్ని ( సబ్ కమిటీని) ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఎన్సీటిఈ అధికారులు తెలిపారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్. వెంకటేశ్వర్లు కె ఎస్ ఎస్ ప్రసాద్ తెలిపారు. బుధవారం యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు N.వెంకటేశ్వర్లు,kSS ప్రసాద్ STFI నాయకత్వం CN భారతి, చావా రవి తో ఢిల్లీలో ఎన్సీటిఈ చైర్మన్ పంకాజ్ అరోరా, …
Read More »లోకేష్‌కు పేరొస్తుందనే అక్కసుతోనే పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై వైసీపీ దుష్ప్రచారం: మాజీ మంత్రి దేవినేని ఉమా
-పట్టిసీమపై ఒక్క మంచి మాట చెప్పలేని జగన్.. డీఎస్సీపై నీతులు చెబుతున్నారా? -పట్టిసీమ నీళ్లతో జరిగిన మేలుకు.. చంద్రబాబుకు జగన్ కృతజ్ఞత చెప్తూ ట్వీట్ చేయాలి గొల్లపూడి, నేటి పత్రిక ప్రజావార్త : మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు మంచి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించిన మెగా డీఎస్సీపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. గొల్లపూడి లోని కార్యాలయంలో …
Read More »సీఎం చంద్రబాబు నాయుడుకు వీడ్కోలు పలికిన డా. పసుపులేటి హరిప్రసాద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో కలిసి శ్రీవారి దర్శన భాగ్యం లభించిందని, పెద్దశేష వాహనసేవలో ముఖ్యమంత్రి తో పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం తిరుగు ప్రయాణంలో …
Read More »
Prajavartha Online Telugu News