Breaking News

సంప్రదాయబద్ధంగా దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
నారా, నందమూరి కుటుంబాలు సంస్కృతి-సంప్రదాయాలను గౌరవించడంలో ముందుంటాయి. నారా లోకేష్, బ్రాహ్మణిల ముద్దుల తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబం మధ్యలో సాధారణంగా, శాస్త్రీయంగా నిర్వహించారు. తాతల మురిపెం.. అమ్మమ్మ, నాన్నమ్మల ఆశీస్సులు.. అమ్మానాన్నల ప్రేమ..మేనమామ ఆత్మీయత.. బంధుమిత్రుల ఆశీస్సులతో .. దేవాన్ష్ నూతన వస్త్ర బహుకరణ వేడుక జరిగింది. హైదరాబాద్ నివాసంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సంప్రదాయబద్ధంగా దేవాన్ష్‌కు నూతన వస్త్రాలు బహుకరించారు. సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం సాగాలని ఆకాంక్షిస్తూ దేవాన్ష్‌ను ఆశీర్వదించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *