Breaking News

“సుజనా ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని “సుజనా” ఫౌండేషన్” ద్వారా శనివారం బబ్బూరి గ్రౌండ్స్ నందు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో డెంటల్, కంటి పరీక్షలు, జనరల్ ఫిజీషియన్ వైద్య సేవలతో పాటు బీ పీ, షుగర్, ఈ సీ జీ, 2డి ఎకో, ఎక్స్ రే, మరియు రక్త పరీక్షలు, ఉచితంగా చేస్తున్నారు.

“సుజనా ఫౌండేషన్” కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేద ,మధ్య తరగతి ప్రజలకు ఉచితంగా అందిస్తూ ప్రజారోగ్యమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో 60 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. పీ వీ ఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు,గవర్నమెంట్ డెంటల్ డాక్టర్స్ , అమరావతి కంటి వైద్యులు, సుజనా ఫౌండేషన్ సిబ్బంది, 40 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పీవీ చిన సుబ్బయ్య, టీడీపీ నేతలు,మన్నెం నారాయణ, రామ నాయుడు, బీజేపీ నాయకులు గన్నవరపు శ్రీనివాసరావు, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ శిబిరంలో తమ సేవలందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *