Breaking News

Daily Archives: September 5, 2026

విజయవాడ ఉత్సవ్‌ను అత్యంత వైభవంగా నిర్వహించాలి : సీఎం చంద్రబాబు నాయుడు

-ఆంధ్రప్రదేశ్, విజయవాడ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు -ప్రజా భాగస్వామ్యంతో నిర్వహించాలని సూచించిన సీఎం -సీఎంను కలిసి విజయవాడ ఉత్సవ్ బుక్ లెట్ ను చూపించిన విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా సందర్భంగా విజయవాడలో నిర్వహించబోయే “విజయవాడ ఉత్సవ్” కార్యక్రమానికి సంబంధించిన బుక్‌లెట్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి చూపించారు. ఈ సందర్భంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహణ, కార్యక్రమాల రూపకల్పన, ప్రజల భాగస్వామ్యం తదితర అంశాలను …

Read More »

భక్తిశ్రద్ధలతో భద్రావతి సమేత భావన ఋషి విగ్రహ ప్రతిష్ఠ…

-పద్మశాలి కళ్యాణ మండపంలో ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం -పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బుద్ధా వెంకన్న ఎంపీ పాల్గొన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భద్రావతి సమేత భావన ఋషి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం, సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి బుద్ధా వెంకన్న తో కలిసి విజయవాడ పార్లమెంట్ సభ్యులు …

Read More »

హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై ముమ్మర తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా అంబేద్కర్ కాలనీ 3వ లైన్‌లోని ప్రియా ఎగ్జిక్యూటివ్ బాయ్స్ హాస్టల్‌ను తనిఖీ చేసి నిబంధనలు పాటించని కారణంగా రూ.1,000 జరిమానా విధించారు. అదేవిధంగా 37వ డివిజన్ పరిధిలోని పండిట్ నెహ్రూ బస్‌స్టాండ్ ప్రాంతంలో మిలిటరీ క్యాంటీన్, బాలాజీ షిర్డీ హోటల్, షిర్డీ క్యాంటీన్, శంకర్ విలాస్, …

Read More »

పోలింగ్ కేంద్రాల గుర్తింపుపై పట్టణ ప్రణాళిక సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌పై పట్టణ ప్రణాళిక సిబ్బందికి శనివారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నూతన భవన సమావేశ మందిరంలో పట్టణ ప్రణాళిక అధికారులు ఈ శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,000 మందికి మించకుండా ఓటర్లను కేటాయించేలా కేంద్రాలను …

Read More »

పోలింగ్ కేంద్రాల్లో ఏఎంఎఫ్ సౌకర్యాలు తప్పనిసరిగా కల్పించాలి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పురపాలక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏఎంఎఫ్ (Assured Minimum Facilities) సౌకర్యాలను తప్పనిసరిగా కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ రూమ్‌లో ఇంజినీరింగ్ సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలింగ్ కేంద్రంలో విద్యుత్, లైట్లు, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీరు, దివ్యాంగ ఓటర్ల …

Read More »

గురువులే మా విజయాలకు మార్గదర్శకులు

-విఎంసి స్విమ్మింగ్ కోర్టులకు ఘనంగా సన్మానించిన స్విమర్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఉదయం విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో కోచ్‌లను ఘనంగా సన్మానించారు. స్విమ్మింగ్‌లో శిక్షణ అందిస్తున్న సీనియర్ కోచ్‌లు, కోచ్‌లు, జిమ్ కోచ్‌లను సీనియర్ స్విమ్మర్లు శ్రీధర్ ప్రసాద్, రమణ, వర్మతో పాటు పలువురు స్విమ్మర్లు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో సత్కరించి గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ స్విమ్మింగ్ కోచ్ మాలాద్రిరావు, కోచ్‌లు లక్ష్మణ్‌రావు, సైదులు, జిమ్ కోచ్, ఇన్‌చార్జి అనిల్‌ను స్విమ్మర్లు ఘనంగా …

Read More »

డిజిటల్‌ పరిజ్ఞానంతో మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

-డిజిటల్‌ టెక్నాలజీని అందిపుచ్చుకుంటే అపార అవకాశాలు -‘ఒక కుటుంబం–ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్యంతో నైపుణ్యాలు -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం సహాయక సంఘాల మహిళలు డిజిటల్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ కల్పించడంతో పాటు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల కోసం నిర్వహించిన వర్క్‌షాప్‌ ఆన్‌ డిజిటల్‌ అండ్‌ టెక్నాలజీ …

Read More »

రైతుల సమక్షంలోనే రీసర్వే నిర్వహించాలి

-రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం -రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్ -రీసర్వే ఆకస్మిక తనిఖీలో సూచనలు చేస్తున్న రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భూముల్లో నిర్వహిస్తున్న రీసర్వేల్లో రైతులను భాగస్వాములను చేసేలా ముందుగానే సమాచారం అందించి వారి సమక్షంలోనే సర్వే నిర్వహించాలని, ఈ కేవైసీ తప్పనిసరిగా నమోదు చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి …

Read More »

నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో గార్బేజ్ పాయింట్లు లేకుండా, ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని నగర పాలక సంస్థ సి.యమ.ఒ.హేచ్ డాక్టర్ శాంతి కళ తెలిపారు. శనివారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం జరగాలని, గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ ఉండడానికి వీలులేదని శానిటరీ ఇన్స్పెక్టర్లను …

Read More »

పర్యావరణ హిత ‘గ్రీన్ గణేష్’ విగ్రహాలతో నవ గుంటూరు లక్ష్యంగా కాలుష్య రహిత వినాయక చవితి వేడుకలు జరుపుకుందాం…

-నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, కాలుష్య రహితంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన నగరంలో సుమారు 25 వేల మంది విద్యార్థులతో మట్టి వినాయక ప్రతిమల తయారీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం నగరపాలక సంస్థ కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యాశాఖ, జిఎంసి అధికారులతో “ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి” వేడుకల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. …

Read More »