మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
బాలలపై ఆన్లైన్ వేధింపుల అరికట్టడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు చైల్డ్ ఫండ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ (వెబ్ సేఫ్ అండ్ వైస్) రాష్ట్రస్థాయి కార్యక్రమం ప్రారంభం.
ఈ సందర్భంగా శ్రీ ఏ.వీ.ఎస్ వేటుకూరి. సూర్యనారాయణ రాజు చైర్ పర్సన్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ వారు మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో బాలలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ముప్పులను సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, మరియు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయినా చైల్డ్ ఫండ్ ఇండియా భాగస్వామ్యంతో ఈ ప్రత్యేక రాష్ట్ర స్థాయి అవగాహన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించామని దీని ద్వారా బాలలపై జరిగే ఆన్లైన్ లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ వంచన మరియు డిజిటల్ బ్లాక్మెయిలింగ్, సైబర్ బుల్లియింగ్, వంటి ముప్పుల నుండి పిల్లలకు రక్షణ కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా బలమైన సురక్షిత డిజిటల్ వ్యవస్థను నిర్మించడమే ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు.
అంతేకాకుండా వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్, మరియు రాష్ట్రస్థాయి యుహాహాత్మక మార్గదర్శకాల రూపకల్పన జరుగుతున్నదని, అదే విధంగా పాఠశాల విద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగము, మరియు పోలీస్ శాఖ ఇతర సంబంధించిన శాఖలతో కలసి శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా రాష్ట్రస్థాయిలో ఈ వేధింపులకు సంబంధించి ఒక సర్వేను మరియు ఒక పరిశోధన కూడా నిర్వహిస్తామని తద్వారా ఈ ఆన్లైన్ వేధింపులకు గురయ్యే బాల బాలికల స్థితిగతులను తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచిస్తామని.
అదేవిధంగా పూర్తిస్థాయిలో తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మరియు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమం పై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి బాలలకు ఆన్లైన్ భద్రత అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తద్వారా బాలల ఆన్లైన్ వేధింపుల నుంచి విముక్తి కల్పించాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశమని చైర్పర్సన్ గారు తెలియజేశారు.
ఈ సందర్భంగా బాలల కోసం సురక్షితమైన ఇంటర్నెట్ అనేటటువంటి (బ్రోచర్ని) కరపత్రాన్ని ఆవిష్కరించుట జరిగినది.
ఈ కార్యక్రమంలో ప్రధానంగా శ్రీ ఏ.వీ.ఎస్ వేటుకూరి. సూర్యనారాయణ రాజు, చైర్పర్సన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్, సభ్యులు శ్రీమతి కే.జీ. వెంకట పద్మలత గారు మరియు మెంబర్ సెక్రెటరీ శ్రీమతి జి.ఉమాదేవి గారు, మరియు చైల్డ్ ఫండ్ ఇండియా నుంచి అమర కుమార్ సింగ్ గారు, రీజనల్ లీడ్, ప్రోగ్రాం అండ్ పార్ట్నర్షిప్ సౌత్ అండ్ వెస్ట్ ఇండియా, మరియు శ్రీ అశోక్ కుమార్ పాండా. స్పెషలిస్ట్ ప్రోగ్రాం తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News