అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో మారిషస్ పబ్లిక్ సర్వీస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రీఫార్మ్స్ శాఖ మంత్రి లచ్మణా (రాజ్) పెంటియా మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఇటీవల మారిషస్ కేబినెట్ మంత్రిగా లచ్మణా (రాజ్) పెంటియా బాధ్యతలు చేపట్టారు. భేటీ సందర్భంగా ద్వైపాక్షిక అంశాలతో పాటు పరిపాలనా సంస్కరణల అంశాలపై చర్చించారు.
Read More »Daily Archives: August 28, 2026
ముఖ్యమంత్రి చంద్రబాబు కి రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి పలువురు మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రికి రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసిన వారిలో మంత్రి సవిత, మాజీమంత్రి పీతల సుజాత, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆచంట సునీత, తదితరులు ఉన్నారు.
Read More »నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికం
-విజన్ ప్లాన్ పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలి -ప్రజల భాగస్వామ్యం తోనే మెరుగైన ఫలితాలు -అన్ని స్థాయిల్లోనూ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాల్సిందే. -నియోజకవర్గ విజన్ ప్లాన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు -నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లపై ముఖ్యమంత్రి సమీక్ష -ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా “ప్రమాణ్ కృతిమ మేధ ఆపరేటింగ్ సిస్టమ్” ఆవిష్కరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా “ప్రామాణిక్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్” రూపొందించిన “ప్రమాణ్ ఆపరేటింగ్ సిస్టమ్”ను ఆవిష్కరించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత అకౌంటింగ్ మరియు స్టాట్యూటరీ కాంప్లయన్స్ జనరేటెడ్ అప్లికేషన్ గా రూపొందించిన “ప్రమాణ్ ఆపరేటింగ్ సిస్టమ్” ఆవిష్కరణ కార్యక్రమంలో సంస్థ ఛైర్మెన్ లంకా దినకర్, సీఈఓ అవినాష్ రైనా, ముఖ్య కార్యనిర్వహక సభ్యులు ఆశిష్, చార్టర్డ్ అకౌంటెంట్లు మేఘన, …
Read More »ప్రజలకు అర్థమయ్యే మాతృ భాష తెలుగులోనే ఉత్తర్వులు: రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల అదేన్న కీలక నిర్ణయం
-తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గాజుల ఆదెన్న చొరవ -“తెలుగులో మాట్లాడుదాం.. తెలుగును కాపాడుకుందాం.. తెలుగును మన భావి తరాలకు అందిద్దాం” అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ తెలుగు భాషావేత్త, వ్యావహారిక భాషోద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త గిడుగు వేంకట రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఆగస్ట్ 29 న మనం నిర్వహించుకునే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ గాజుల ఆదెన్న తన పరిధిలోని ఆర్టీఐ అర్జీదారులకు, అధికారులకు , ప్రజలకు మరింత …
Read More »డ్రగ్స్ వద్దు – క్రీడలు ముద్దు పై భారీ ర్యాలీ
-అమరావతి ఛాంపియన్‌షిప్ – గ్రామీణ ప్రతిభకు రాష్ట్రస్థాయి వేదిక -65% ప్రభుత్వ విద్యార్థులు – 80% గ్రామీణ యువత క్రీడల్లో మెరిసిన వేళ -సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో విజయవంతమైన పోటీలు -డ్రగ్స్ వద్దోయ్ బ్రో’ – యువతతో భారీ అవగాహన ర్యాలీ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్’ లక్ష్య సాధనలో భాగస్వామ్యం -సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో క్రీడాకారుల పాత్ర -శాప్ ఛైర్మన్ రవి నాయుడు -విద్యార్థులు, యువత క్రీడలు, విద్య, సృజనాత్మకత వైపు దృష్టిసారించాలి -12 వేల …
Read More »2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం
-పర్యావరణ పరిరక్షణలో ప్రజలనూ భాగస్వాములను చేస్తాం -మొక్కలు నాటడమే కాదు.. వాటి మనుగడకూ ప్రత్యేక దృష్టి -అన్ని శాఖలనీ సమన్వయం చేసుకొని లక్ష్యాలను సాధిస్తాం -ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ అనంతరం మీడియాతో మాట్లాడిన నాగబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ, వృక్ష సంపదను విస్తరించి 2047 నాటికి మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు …
Read More »ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ శాసన మండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్‌రీచ్‌మెంట్ (ఏపీ గ్రీన్) సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా శుక్రవారం అధికారిక బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని అరణ్యభవన్‌లో జరిగిన కార్యక్రమంలో నాగబాబు తన సతీమణి పద్మజ తో కలిసి పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు నాగబాబు కి వేద ఆశీర్వచనం అందించారు. …
Read More »మూడు దశాబ్దాల వెలుగొండ కల సాకారం
-ప్రాజెక్టు పూర్తి.. నిర్వాసితుల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం -అర్హులైన ప్రతి నిర్వాసితుడికీ పరిహారం – రికార్డుల్లో లోపాలున్నా ఆందోళన అవసరం లేదు -రూ.169 కోట్ల అదనపు భారం అయినా ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మార్కాపురం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకాశం ఉమ్మడి జిల్లాలోని కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలనే మూడు దశాబ్దాల వెలుగొండ కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల …
Read More »బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ ఆజాద్‌కు ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ శుభాకాంక్షలు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ కార్పొరేషన్ నూతన మేనేజింగ్ డైరెక్టర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతల్లో చంద్రశేఖర్ ఆజాద్ విజయవంతంగా పనిచేస్తూ, బ్రాహ్మణ సమాజ సంక్షేమం మరియు అభ్యున్నతికి మరింత సమర్థవంతంగా సేవలందించాలని ఛైర్మన్ బుచ్చి రామ్ ప్రసాద్ ఆకాంక్షించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా చేరేలా కృషి చేయాలని కోరారు. …
Read More »
Prajavartha Online Telugu News