Breaking News

మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి కృష్ణమ్మ జలాలు…ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయని పేర్కొన్న సీఎం

రేపు వెలిగొండ పండుగ వద్ద కలుద్దాం అంటూ ప్రజలకు పిలుపునిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్

మూడు దశాబ్దాల నిరీక్షణకు ముగింపు…

మూడు జిల్లాల్లో లక్షల మంది ప్రజల భవిష్యత్తుకు తొలి అడుగు….

మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోంది. దాదాపు 30 ఏళ్లుగా కరువు పీడిత ప్రాంత ప్రజలు కంటున్న వెలిగొండ కల… కృష్ణమ్మ జలాలతో కళ్లముందు నిజం కాబోతోంది.
కరవుతో అల్లాడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రజల కష్టాలు తీర్చాలన్న సంకల్పంతో 1996లో మొదలుపెట్టిన ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసి రేపు ప్రారంభించే అవకాశం రావడం నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. నా మనసుకు ఎంతో సంతోషానిస్తోంది.

వెలిగొండ అంటే కేవలం ఒక ప్రాజెక్టు కాదు…
కరవుతో పోరాడిన రైతన్నకు భరోసా…
ఫ్లోరైడ్‌ బాధిత కుటుంబాలకు ఆరోగ్య భద్రత…
వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై భవిష్యత్తు…
పేదరికంలో మగ్గిన ప్రాంతానికి ప్రగతి మార్గం….

మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుంది.
ఈ మహాయజ్ఞం కోసం తమ భూములను, ఇళ్లను, పుట్టిపెరిగిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

నల్లమల కొండలను చీల్చుకుంటూ నల్లమల సాగర్‌లోకి దూసుకువచ్చే కృష్ణమ్మ జలాలు…. ఆ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలను సమూలంగా కడిగేస్తాయి.

అందుకే రేపటి నుంచి మొదలయ్యే వెలిగొండ జలసిరులు…అభివృద్ధికి రెక్కలు.

రేపు వెలిగొండ పండుగ దగ్గర కలుద్దాం!

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కరువు నేలకు కృష్ణమ్మ వరప్రదాయిని.. వెలిగొండతో రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు

– 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. లక్షలాది ప్రజలకు తాగునీటి భరోసా – నాడు శంకుస్థాపన చేసిన చంద్రబాబు చేతుల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *