Breaking News

Daily Archives: August 23, 2026

ఘనంగా హెచ్‌సీఎల్ గ్రూప్ 50వ వార్షికోత్సవ వేడుకలు

-విజయవాడలో సిద్ శ్రీరామ్ సంగీత కచేరీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : హెచ్‌సీఎల్ గ్రూప్ తన 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడలో ఉద్యోగుల కోసం ప్రత్యేక సంగీత కచేరీని నిర్వహించింది. ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు సిద్ శ్రీరామ్ ఈ కార్యక్రమంలో తన సంగీతంతో అలరించారు. హెచ్‌సీఎల్‌టెక్ క్యాంపస్‌లో జరిగిన ఈ వేడుకలో హెచ్‌సీఎల్ గ్రూప్, శివ్ నాడార్ ఫౌండేషన్‌కు చెందిన 3,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హెచ్‌సీఎల్ గ్రూప్, హెచ్‌సీఎల్‌టెక్ …

Read More »

శబరిమల పవిత్రతను కాపాడాలి.. భక్తుల సమస్యలు పరిష్కరించాలి

-గురుస్వాముల రాష్ట్ర సమ్మేళనంలో పీవీఎన్‌ మాధవ్‌.. టీటీడీ తరహాలో వ్యవస్థకు డిమాండ్‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శబరిమల అయ్యప్ప క్షేత్ర పవిత్రతను కాపాడటంతో పాటు అయ్యప్ప భక్తులకు మెరుగైన యాత్రా సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పనిచేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. నవంబరు 15 నుంచి జనవరి 20 వరకు జరిగే అయ్యప్ప సీజన్‌లో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో …

Read More »

మహిళా సాధికారతకు బీజేపీ పెద్దపీట

-వికసిత్ భారత్‌లో యువతదే కీలక పాత్ర -పార్టీ పదవుల్లో 33 శాతం మహిళలకు కేటాయింపు -చట్టం చేసే ముందు ఆచరించి చూపిస్తున్నాం -పదవుల కోసం కాదు.. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి రావాలి -యువత భవిష్యత్ ప్రజాప్రతినిధులుగా ఎదగాలి: కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా సాధికారతకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. చట్టాలు చేసే ముందు వాటిని ఆచరించి …

Read More »

మంత్రి అనగాని సత్యప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతిలో జరగనున్న అమరావతి ఛాంపియన్‌షిప్ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి, తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మంత్రి అనగాని సత్యప్రసాద్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం …

Read More »

రేపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

-ఉపరాష్ట్రపతితో కలిసి మొక్కజొన్న కొత్త వంగడాన్ని ఆవిష్కరించనున్న సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల పంటకు విలువ జోడించి, ప్రాసెసింగ్, బ్రాండింగ్‌తో మార్కెట్‌కు తరలించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రయోగానికి ఏలూరు జిల్లా ముసునూరు వేదిక కానుంది. దేశంలో తొలి నాన్-GMO పాప్‌కార్న్ మెయిజ్ హైబ్రిడ్ విత్తనాన్ని ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు సంయుక్తంగా ఆవిష్కరించనున్నారు. ఏలూరు జిల్లా జిల్లా ముసునూరులో గోర్మే పాప్‌ కార్నికా సంస్థ ఆధ్వర్యంలో జన్యు పరంగా మార్పు చెందని మొక్కజొన్న వంగడాన్ని …

Read More »

“మూడు దశాబ్దాల కలగా ఉన్న వెలిగొండ నిర్వాసితుల జీవితాలకు వెలుగు“

-రాష్ట్రానికి పోలవరం జీవనాడి – పశ్చిమ ప్రకాశం ( మార్కాపురం జిల్లా) కి వెలిగొండ జీవనాడి. -ఫ్లోరైడ్ మరియు కరువు సమస్యలకు చెక్ -సాగు, త్రాగు మరియు పారిశ్రామిక అవసరాలకు నీటి వనరుల లభ్యత -పోలవరం నుండి బొల్లాపల్లికి, బొల్లాపల్లి నుండి వెలిగొండ ( నల్లమల్ల సాగర్ ) కి అనుసంధానం ద్వారా దీర్ఘాకాలిక నీటి వనరుల లభ్యత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మూడు దశాబ్దాలుగా కలగా మిగిలిన వెలిగొండ ప్రాజెక్ట్ తొలి దశ పూర్తి చేసి 1.09 లక్షల ఎకరాలకు …

Read More »

వినుకొండకు రూ.240 కోట్లతో సమగ్ర మంచినీటి పథకం

-రాష్ట్రంలో రూ.10 వేల కోట్లతో మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ, చెరువులు, పార్కులు అభివృద్ధి -రూ.2,123 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 1,392 రహదారులు నిర్మాణం -ప్రజలకు మంచి చేయడమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం -వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల నిర్లక్ష్యంతో… అభివృద్ధి పనులపై 25 శాతం అదనపు భారం -పల్నాడు జిల్లా ఇంచార్జి మంత్రి గొట్టిపాటి పల్నాడు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఇంధన శాఖ మంత్రి, పల్నాడు జిల్లా …

Read More »

మహోన్నత వేడుకలా మహాగణపతి మట్టి సేకరణ

-మూడు స్తంభాల సెంటర్ నుండి మంగినపూడి వరకు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఊరేగింపు -దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, ప్రఖ్యాత స్థలాల నుండి మట్టి సేకరించిన కమిటీ -మట్టి వినాయకుని పూజించడమంటేనే ప్రకృతిని ప్రేమించడమన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మంగినపూడి సముద్రతీరంలో ఏర్పాటు చేస్తున్న సాగరతీర మహాగణపతి విగ్రహ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములవ్వడం ఆనందంగా ఉందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నంలోని ఇళ్ల నుండి, వ్యవసాయ క్షేత్రాల …

Read More »

ఆధ్యాత్మిక ప్రగతి దారులు

-100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం -రూ. 120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయ అనుసంధాన రోడ్లు -ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి నరసింహ క్షేత్రాలకు రహదారి కళ -వాడపల్లి కరకట్ట మార్గం, అర్థగిరి, గంగమ్మ జాతర రోడ్లకు కేటాయింపులు -శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా రోడ్ల నిర్మాణానికి రూ. 30 కోట్లు -నిర్మాణం పూర్తి చేసుకున్న 40 శాతం రోడ్లు -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పంతో భక్తులకి సౌకర్యం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …

Read More »

ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి విస్తృత తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.శ్రవణ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ వారి ఆదేశాలు ప్రకారం ఈరోజు గిరిపురం- ఈట్ స్ట్రీట్ నందు, మొగల్రాజపురం, దుర్గాపురం మరియు రాజరాజేశ్వరి పేట నందు, మాంసం దుకాణాలు, చికెన్ దుకాణాలు, పానీపూరి బండ్లు,చాట్ మసాలా బండ్లు, ఫ్రూట్ జ్యూస్ స్టాల్స్, త్రాగునీటి ఆర్వో ప్లాంట్లు, నందు విస్తృత తనిఖీలు నిర్వహించుట జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ప్రతిచోట, పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పరిశుభ్రత, ఆహార …

Read More »