Breaking News

Daily Archives: August 13, 2026

ఐలా పాలకవర్గ ఎన్నికలలో అన్నే ప్యానల్ దే విజయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ పాలకవర్గం ఎన్నికల్లో అన్నే శివనాగేశ్వరరావు ప్యానల్ ఘన విజయం సాధించింది. పాలక వర్గంలోని ఐదు కార్యవర్గ పదవులతోపాటు 13 మెంబర్ పదవులను గెలుచుకుంది. ఐలా పాలకవర్గం ఎన్నికలు ఆటోనగర్ లోని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయి. మొత్తం 1,183 ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి. అంటే 74.5 శాతం పోలింగ్ నమోద యిందని ఎన్నికల …

Read More »

నేతాజీ సైనిక్ స్కూల్‌లో 112 ఏళ్ల స్వామీజీ సందడి.. విద్యార్థులకు హితబోధ…

ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండలోని నేతాజీ సైనిక్ స్కూల్‌ ను గురువారం హిమాలయాలకు చెందిన112 ఏళ్ల వయస్సు గల సంత్ సదానందగిరి స్వామీజీ, సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులు సిబ్బందితో ముచ్చటించి వారికి దిశానిర్దేశం చేశారు. జీవితంలో టీ, అక్షరమే కీలకం స్వామీజీ తన ప్రసంగంలో విద్యార్థులకు ఒక వినూత్నమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంగ్లీష్ అక్షరం టీ, తో మొదలయ్యే హ్యూమానిటీ సిన్సియారిటీ వంటి మంచి గుణాలను అన్వేషించాలని వాటిని జీవితంలో ఆచరించాలని ఆయన …

Read More »

ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026 ప్రకారం వ్యర్థాలను నాలుగు రకాలుగా వేరు చేసి సంబంధిత రంగుల బుట్టల్లో వేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల వేర్పాటుపై ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. …

Read More »

పార్కుల నిర్వహణలో ప్రజలు భాగస్వాములు కావాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఐసీ కాలనీలోని పార్కును సందర్శించి, అక్కడి సౌకర్యాలు, పారిశుధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రజలకు కేవలం ఆహ్లాదం అందించడమే కాకుండా, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్‌లను కూడా ఏర్పాటు చేసినట్లు …

Read More »

దరఖాస్తులను ఈ నెల 17లోపు నూరు శాతం పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను ఈ నెల 17లోపు నూరు శాతం పరిష్కరించాలని సిటీ ప్లానర్ రాంబాబు స్పష్టం చేశారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత వార్ద్ సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్ లలోని …

Read More »

అన్ని రంగాల్లో నిడదవోలును అభివృద్ధి పథంలో నిలుపుతాం:మంత్రి కందుల దుర్గేష్

-ఉండ్రాజవరంలో నిర్వహించిన మండల నాయకుల సమావేశంలో మంత్రి దుర్గేష్ కీలక వ్యాఖ్యలు..స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సంసిద్ధంగా ఉండాలని పిలుపు -పర్యాటక మంత్రిగా వచ్చిన అవకాశంతో రూ.3 కోట్లతో కోట సత్తెమ్మ ఆలయ అభివృద్ధికి చర్యలు -ఉండ్రాజవరంలో ఘనంగా ‘తిరంగా ర్యాలీ’.. పాల్గొన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గురువారం ఉండ్రాజవరం ఎంపీడీవో …

Read More »

గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘అక్రమార్కులకు ఆలవాలమైన కమిషన్’:మంత్రి కందుల దుర్గేష్

-ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అక్రమాలపై ఏర్పాటు చేసిన సిట్ నివేదిక గత ప్రభుత్వ అరాచక పాలనకు, పాపాలకు నిలువెత్తు చెంపపెట్టు అని మంత్రి దుర్గేష్ వెల్లడి -అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు ప్రభుత్వం సన్నాహాలు.. మాయమాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని మంత్రి దుర్గేష్ హితవు -దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డీఎస్సీపై చర్చించండి… శాసనసభ వేదికగా సమాధానం చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమన్న మంత్రి దుర్గేష్ నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ ఐదేళ్ల హయాంలో ఏపీపీఎస్సీ అంటే ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ …

Read More »

రాజమహేంద్రవరం అభివృద్ధికి పెద్దపీట

-తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమహేంద్రవరం నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగర అభివృద్ధి పనులపై శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) సోము వీర్రాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు గల ప్రధాన రహదారి విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం …

Read More »

సింగరాజుపాలెం రైతుల సమస్యలకు పరిష్కారం.. కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాలతో క్షేత్రస్థాయిలో చర్యలు

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) కె. ఆనందరావు గురువారం నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి, ఏడాది కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిశీలించారు. గ్రామానికి చెందిన 85 మంది రైతుల సుమారు 300 ఎకరాల భూమి స్వభావం పట్టాదారు భూముల స్థానంలో బీడు భూములుగా నమోదవడంతో రైతులకు అడంగల్ అందకపోవడం, బ్యాంకు రుణాలు మంజూరు కాకపోవడం, ఈ-క్రాప్ నమోదు జరగకపోవడం వంటి …

Read More »

నూతన రైతుబజార్ల నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర రైతు బజార్ల సి ఈ వో డాక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రైతుబజార్ల ప్రధాన కార్యనిర్వాహక అధికారి (Chief Executive, Rythubazars)  డాక్టర్ కె. మాధవీలత గురువారం రాజమహేంద్రవరం పరిధిలోని పలు రైతుబజార్లను సందర్శించి, నూతన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం లో నూతన రైతుబజార్ నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. సుమారు రూ.55 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్న ఈ రైతుబజార్ ద్వారా రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అనంతరం 45వ వార్డులో రూ.45 …

Read More »