విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ సింగినగర్ మాకినేని బసవ పున్నయ్య స్టేడియం గ్రౌండ్లో నిర్వహించిన 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ కోఆర్డినేటర్ అరవ రమేష్ కి బాలల హక్కుల పరిరక్షణ, ఆపదలో ఉన్న బాలల రక్షణ, మత్తు పదార్థాలకు నిర్మూలనకు , బాల్యవివాహాల నిర్మూలనకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు, అందిస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా మెరిటోరియస్ సర్టిఫికెట్ అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ఈ మెరిటోరియస్ సర్టిఫికెట్ను అరవ రమేష్ స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీ షా, ఐఏఎస్ మరియు ఎస్.వి. రాజశేఖర్ బాబు, ఐపీఎస్ అభినందనలు కూడా అందుకున్నారు.
బాలల హక్కుల పట్ల సమస్యల పట్ల ప్రజలలో మరియు ముఖ్యంగా విద్యార్థులలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, చేస్తున్న కృషికి ఈ గుర్తింపు నిదర్శనంగా నిలిచింది.
Prajavartha Online Telugu News