Breaking News

ఉద్యోగులారా మేల్కొండి..! ఉద్యమానికి సిద్ధంకండి…!!

-ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఉద్యమ శంఖారావం.
-ఈనెల 28న శుక్రవారం విజయవాడలో “రాష్ట్రస్థాయి సదస్సు” ….అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన.
-ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనా..!?
-మాకు రావల్సి భకాయిలు 40 వేల కోట్లు అడుగుతుంటే ఉద్యోగులను ప్రజలు ముందు దోషులను చేయాలన్న ప్రయత్నాలు సమంజసమేనా..
-ఇంతవరకు కూటమి ప్రభుత్వం చెల్లించిన డబ్బుల్లో అధికశాతం మేము దాచుకున్న డబ్బులే..
-ఉద్యమం ప్రారంభం అయితే దానికి భాధ్యత ప్రభుత్వానిదే…
-బొప్పరాజు వెంకటేశ్వర్లు / పలిశెట్టి దామోదరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, సమస్యల పరిష్కారంలో కొనసాగుతున్న జాప్యాన్ని ఇక ఏమాత్రం సహించేది లేదని ఏపీజేఏసీ అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టెట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు స్పష్టం చేశారు.

ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించక తప్పని పరిస్థితిని ప్రభుత్వమే కల్పించిందని వారు పేర్కొన్నారు.

ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటేరియట్ మరియు ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఉద్యమ కమిటీ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, ఉద్యమ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు, మహిళా విభాగం ఛైర్పర్సన్ పి.లక్ష్మీ, సెక్రెటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, ప్రభుత్వ వైఖరి, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా బొప్పరాజువెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర భృతి, డీఏలు, పీఆర్సీ తదితర న్యాయమైన హక్కులను పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారంలో ఆశించిన స్థాయిలో ముందడుగు పడటం లేదన్నారు.

ఒక రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
గత రెండేళ్లుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు.
“ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ అడగడం లేదు. తమకు రావాల్సిన న్యాయమైన హక్కులనే అడుగుతున్నారు. . ఉద్యోగులకు చెల్లించిన బకాయిల్లో అధిక భాగం ఉద్యోగులు తమ జీతాల నుంచి దాచుకున్న సొమ్మే. అయినా తమ హక్కుల కోసం అడిగే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు* చేయడం సరికాదు” అని బొప్పరాజు అన్నారు.

కూటమి ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని ఇచ్చిన హామీని గుర్తుచేస్తూ, ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన ప్రయోజనాలను చెల్లించకపోవడమేనా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటం అంటే…అని ప్రశ్నించారు.

ఈ సమావేశంలో పాల్గోన్న మరో ముఖ్యఅతిధి పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ ప్రభుత్వమే ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యం చేస్తూ ఉద్యమానికి ప్రేరేపిస్తోందిని అన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, సమస్యలను పరిష్కరించకుండా పదేపదే కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వమే ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపిస్తోందని,
“ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. “చేపట్టబోయే ఈ ఉద్యమం ఉద్యోగుల న్యాయమైన హక్కులు, ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడం కోసం, భవిష్యత్ తరాల ప్రయోజనాల కోసం చేసే ప్రజాస్వామ్య పోరాటం” అని ఆయన స్పష్టం చేశారు.
దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారం రావాలంటే ఉద్యమమే సరైన మార్గమని, ప్రజాస్వామ్యంలో హక్కుల సాధన కోసం పోరాటం చేయడం ఉద్యోగుల హక్కు అని దామోదరరావు అభిప్రాయపడ్డారు.

ఈనెల 28న రాష్ట్రస్థాయి సదస్సు

ప్రభుత్వ స్పందన లేని నేపథ్యంలో గతంలో వాయిదా వేసిన ఉద్యమ కార్యాచరణను ఇక మరింత ఉదృతంగా, ఐక్యంగాకొనసాగించాలని సమావేశం నిర్ణయించింది. .
అందుకే ఉమ్మడి జిల్లాల సన్నద్ధ సభల స్థానంలో నేరుగా రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని నిర్ణయించారు.

ఈనెల 28న విజయవాడలో “రాష్ట్రస్థాయి సదస్సు” నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సదస్సుకు ఏపీ జేఏసీ అమరావతి పురుషుల విభాగం, మహిళా విభాగాలకు చెందిన రాష్ట్ర, జోనల్, జిల్లా, డివిజన్ స్థాయి నాయకులు హాజరుకానున్నారు.

సదస్సులో ఉద్యోగుల సమస్యలపై సమగ్రంగా చర్చించి, ప్రభుత్వ వైఖరిని సమీక్షించడంతో పాటు ఉద్యమ శంఖారావం పూరించి, *అదే రోజు ఉద్యమ షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్లు ఉద్యమ కమిటి చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు తెలిపారు.

అదేవిధంగా సదస్సులో తీసుకున్న తీర్మాణాల మేరకు ఉద్యమ కార్యాచరణకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెంటనే నోటీసు అందజేయాలని, ఉద్యోగులు, పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కోసం కలిసి వచ్చే అన్ని ఉద్యోగ, పెన్షనర్ సంఘాలను సంప్రదించి ఉద్యమంలో భాగస్వాములను చేయాలని సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఇప్పుడు ఉద్యోగులంతా ఒక్కటై ఉద్యమానికి సిద్ధం కాకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుంది. .

ఈరోజు మన హక్కుల కోసం నిలబడకపోతే రేపటి తరానికి మనమే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఉద్యోగి ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి” అని బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి దామోదరరావు పిలుపునిచ్చారు.

ఉద్యమం కారణంగా భవిష్యత్‌లో ప్రజలకు ఏదైనా అసౌకర్యం కలిగితే అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

ఈ సమావేశం లో ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కోశాధికారి తిమ్మసర్తి నాగేశ్వరరావు,( మున్సిపల్ డిపార్ట్మెంట్) ఆర్గనైజింగ్ సెక్రటరీ బి కిషోర్ కుమార్ ( లేబర్ డిపార్ట్మెంట్) పబ్లిసిటీ సెక్రటరీ ఆర్ శ్రీనివాసరావు ( పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్), కో చైర్మన్ లు చెవ్వూరి రవి (ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం ), సంసాని శ్రీనివాసరావు( ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ) ఎస్ మల్లేశ్వరరావు ( ఏపీ క్లాస్ IV ఉద్యోగుల) పివిఎన్ శాస్త్రి (విశ్రాంత ఉద్యోగుల సంఘం) జి శివానందరెడ్డి (విద్యాశాఖ ) వైస్ చైర్మన్ లు Dr. T. జయప్రకాశ్ (పశుసంవర్ధక శాఖ), ఎ కుమార్ రెడ్డి ( జల వనరుల శాఖ ) కె వెంకటేశ్వర రావు (టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ), కార్యదర్శులు వేల్పుల అరలయ్య ( గ్రామ వార్డు సచివాలయాల శాఖ ) కె చంద్ర శేఖర్ (ఫైర్ అండ్ డిజాస్టర్ నిర్వహణ శాఖ ), కోన ఆంజనేయ కుమార్ ( VROs అసోసియేషన్ ) జే వి అనుదీప్ యాదవ్ (పౌర సరఫరాల శాఖ ) సంఘంమహిళా విభాగం రాష్ట్ర చైర్ పర్సన్ పారె లక్ష్మి ( పశుసంవర్ధక శాఖ) సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి ( రెవెన్యూ డిపార్ట్మెంట్) అసోసియేట్ చైర్ పర్సన్ శివకుమారి రెడ్డి ( సమగ్ర శిక్ష) కోశాధికారి సాయి లక్ష్మి ( వైద్య ఆరోగ్యశాఖ), ఉద్యమ కార్యాచరణ కమిటీ మెన్ & ఉమెన్ జోనల్ ఇన్ చార్జ్ లు ఎస్ నాగేశ్వర రెడ్డి, జి.వీరవాణి (zone I), బత్తిన రామకృష్ణ, బి.గీతిక (zone II), వి సురేష్ బాబు, పి.రజని (zone III) R N దివాకర్, యస్.కే.సహరాబాను (Zone IV) మరియు మల్టీజోన్ 1 ఇన్ చార్జి యన్.సీతామాలక్ష్మి,
మల్టీజోన్ 2 ఇన్ చార్జి అనుపమా తో పాటు క్యాప్టల్ సిటీ చైర్మన్ రవిప్రసాధ్, ప్రధానకార్యదర్శి మందపాటి శంకరరావు వివిధ శాఖలకు చెందిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాష్ట్ర మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు అన్ని జిల్లాల మరియు డివిజన్ల ఏపీజేఏసీ అమరావతి కార్యవర్గ సభ్యులు మరియు మహిళా విభాగాల కార్యవర్గ సభ్యులు జోనల్ ఇన్చార్జిలు మరియు ఉద్యమ కార్యాచరణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

-జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ పోలీస్ పరేడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *