Breaking News

Daily Archives: August 1, 2026

భోగాపురంలో రూ.17,900 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభించి, జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-రాష్ట్రాభివృద్ధికి విమానయానం, స్వచ్ఛ ఇంధనం, సెమీకండక్టర్లు, అనుసంధానత రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు: పీఎం -గిరిజన వర్గాల సంక్షేమానికి అల్లూరి సీతారామరాజు జీవితాన్ని అంకితం చేసిన ఈ నేలపైనే.. ఆంధ్రప్రదేశ్‌లో నేడు ప్రారంభమైన నూతన విమానాశ్రయం: పీఎం -ఆంధ్ర, ఉత్తరాంధ్ర అభివృద్ధికి వేదికగా ఈ విమానాశ్రయం… ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యత్తుకు ప్రారంభ వేదిక: పీఎం -ప్రతిభావంతులైన మన యువత సామర్థ్యం నుంచి ఆంధ్రప్రదేశ్, దేశం గరిష్ఠ ప్రయోజనాన్ని పొందటం అత్యవసరం.. ఇందుకోసం మేం సెమీకండక్టర్ల వంటి భవిష్యత్ సాంకేతికత ఆధారిత పరిశ్రమలపై దృష్టి సారిస్తూ …

Read More »

ఉత్తరాంధ్ర… ఇకపై ఉత్తమ ఆంధ్ర

-భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త దశ -ఎయిర్ పోర్టుకు నాడు కొబ్బరి కాయ కొట్టాం… నేడు గుమ్మడి కాయ కట్టాం -మోదీ నాయకత్వంలో రాష్ట్ర పునర్నిర్మాణానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం -ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ అభివృద్ధి చేస్తాం… 8 ప్రాధాన్యత ప్రాజెక్టులను పూర్తి చేస్తాం -వంశధార-గోదావరి నదులను అనుసంధానిస్తాం -అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ అడ్రస్ లేకుండా పోయింది -మోదీ లాంటి నాయకుడు దేశానికి లభించడం అదృష్టం -2047 వికసిత్ భారత్ మోదీతోనే సాధ్యం -భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవ సభలో సీఎం చంద్రబాబు -అల్లూరి సీతారామరాజు …

Read More »

ఎర్ర బస్సు రాని చోటకు ఎయిర్ బస్సా అన్నవారికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమే సమాధానం

-కూటమిలో మూడు పార్టీలు ఉండడంతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం -ఈ అభివృద్ధి కోసమే 2024 ఎన్నికల్లో తపనపడ్డాను -దేశం కోసం సెలవు తీసుకోకుండా కష్టపడుతున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించి ఇష్టానుసారం మాట్లాడడం బాధించింది -మూడవసారి ప్రధానిగా మోదీ దేశాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకు వెళ్తున్నారు -మోదీ కి వెనుక బలంగా నిలబడదాం -భోగాపురంలోని శ్రీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘2024 …

Read More »

ఎర్రబస్సు రాదన్న చోటకు ఎయిర్ బస్సు వచ్చింది

-ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా -మోదీజీ వికసిత్ భారత్… సీబీఎన్ విజన్ ప్ర‌తిరూపం భోగాపురం ఎయిర్ పోర్ట్‌ -ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్ ఉత్తరాంధ్ర -అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవ సభలో మంత్రి లోకేష్ విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : `కొందరు ఎర్రబస్సు రాని ఊరికి విమానాశ్రయం అవసరమా అని అన్నారు. ఉత్తరాంధ్రను తక్కువగా అంచనా వేసి ఇక్కడి ప్రజలను అవమానించిన‌ వాళ్లకి ఈరోజు దిమ్మ తిరిగే సమాధాన‌మే అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవం. ఎర్రబస్సు రాదు అన్న …

Read More »

శెహ‌భాష్‌…లోకేష్‌..

-మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టిన ప్ర‌ధాని మోదీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : `నువ్వు చాలా బాగా ప‌నిచేస్తున్నావు.. శెహ‌భాష్‌..లోకేష్‌` అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్ భుజం త‌ట్టారు. భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్స‌వం చేసిన అనంత‌రం బ‌య‌లుదేరిన ప్ర‌ధానికి నారా లోకేష్ వీడ్కోలు ప‌లికారు. ఆప్యాయంగా భుజం త‌ట్టిన ప్ర‌ధాని.. బాగా ప‌నిచేస్తున్నావు..ఇదే వేగం, స్ఫూర్తితో ప‌నిచేయాల‌ని సూచించారు. గ‌తంలోనూ ఏపీలో ప్ర‌ధాని మోదీ పాల్గొన్న కార్య‌క్ర‌మాలు …

Read More »

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం

-ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో రాష్ట్రంలో మౌలిక వసతులకు భారీ ప్రోత్సాహం -భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌. -కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విజయనగరం(భోగాపురం), నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో …

Read More »

ఉత్తరాంధ్ర అభివృద్ధికి సింహద్వారం.. భోగాపురం : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు అవకాశాల కోసం ప్రపంచం వైపు ఉత్తరాంధ్ర చూసేదని.. ఇప్పుడు ప్రపంచం మనవైపు చూసేలా భోగాపురం విమానాశ్రయం చేసిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శనివారం నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరిగిన భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా …

Read More »

నీట్- యూజీ 2026 (NEET-UG 2026) కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ ఖరారు

-ఆగస్టు 4 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం -డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్-యూజీ 2026 ప్రవేశాలకు సంబంధించి అఖిల భారత కోటా, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర విశ్వవిద్యాలయాలు, రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి పులాల చంద్రశేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన తేదీలను గమనించి, నిర్దేశిత గడువులో అవసరమైన …

Read More »

ఉమ్మడి కృష్ణాజిల్లా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలి… : జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక

-రూ.98 లక్షలతో ఆధునీకరించిన జిల్లా పరిషత్ సమావేశ మందిరం ప్రారంభం -జిల్లా పరిషత్ ఆస్తుల పరిరక్షణ, ఆదాయ వృద్ధికి ప్రత్యేక చర్యలు -మహిళా ఉద్యోగుల సంక్షేమానికి క్రెచ్, మహిళా విశ్రాంతి గది ప్రారంభం -జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహణ -సమావేశంలో పాల్గొన్న ఇన్చార్జి జిల్లా కలెక్టర్ ఎం నవీన్, నూజివీడు సబ్ కలెక్టర్ బి వినూత్న, కృష్ణాజిల్లా సహాయ కలెక్టర్ నమ్రత అగర్వాల్, ఉమ్మడి కృష్ణాజిల్లా అధికారులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ …

Read More »

ప్రజారాజధాని అమరావతిలో పర్యటించిన ఆస్ట్రేలియా మంత్రి జూలియన్ హిల్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆస్ట్రేలియా ప్రభుత్వ అంతర్జాతీయ విద్య, పౌరసత్వం, కస్టమ్స్, బహుళ సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జూలియన్ హిల్ తమ ప్రతినిధి బృందంతో కలిసి శనివారం రాజధాని అమరావతిలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా బృందం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆస్ట్రేలియా ప్రతినిధి బృందానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి TG భరత్, APCRDA కమిషనర్ వి.విజయ రామరాజు ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా, అమరావతి అభివృద్ధి ప్రణాళికలను …

Read More »