Breaking News

అద్దంకి ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారమే లక్ష్యం

-101.96 కోట్లతో రక్షిత మంచినీటి పథకం
-83 కిమీ నీటి సరఫరా పైప్‌లైన్, 15 కిమీ ఫీడర్ ఛానెల్
-ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త :
అద్దంకి పట్టణ ప్రజలకు దీర్ఘకాలికంగా తాగునీరు అందించే లక్ష్యంతో రక్షిత మంచినీటి పథకం పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం నాడు సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో పబ్లిక్ హెల్త్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమారు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షిత మంచినీటి పథకం పురోగతి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అద్దంకి పట్టణం పరిధిలో రక్షిత మంచినీటి పథకం కోసం ఇప్పటికే రూ.101.96 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభమైనట్లు అధికారులు మంత్రికి వివరించారు. ప్రజలకు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా ఉండేలా 51 లక్షల లీటర్ల సామర్థ్యం గల నీటి నిల్వ ట్యాంకులను నిర్మించాలని మంత్రి ఆదేశించారు. అలాగే 83 కిలోమీటర్ల మేర నీటి సరఫరా పైప్‌లైన్, 15 కిలోమీటర్ల ఫీడర్ ఛానెల్ నిర్మాణాన్ని నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి రోజు 12 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసి పంపిణీ చేసే సామర్థ్యంతో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పారు. పట్టణ పరిధిలోని ఊర చెరువు అభివృద్ధి పనులను Rs. 5.10 కోట్ల వ్యయంతో చేపట్టి, నీటి వనరులను పరిరక్షించడంతో పాటు చుట్టూ.. వాకింగ్ ట్రాక్, సుందరీకరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యతా లోపాలు లేకుండా పకడ్బందీగా పర్యవేక్షిస్తూ యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *