Breaking News

Daily Archives: August 1, 2026

ప్రతీ నియోజక వర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ నియోజక వర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ (C.M.Saikanth Varma) తెలిపారు. జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఇ.పి.సి) సమావేశం కలెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఇ పార్క్ ఏర్పాటుకు పొన్నూరు మినహా అన్ని నియోజక వర్గాలలో భూములను గుర్తించడం జరిగిందని చెప్పారు. ప్రతి నియోజక వర్గంలో ఒక్కో మోడల్ లో ఏర్పాటుకు కార్యాచరణ …

Read More »

స‌ప్త‌సింధు 2026-సృజ‌నాత్మ‌క సంగ‌మం

– సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్పం.. ఒకే వేదిక‌పైకి – వారసత్వ పరిరక్షణలో యువతదే కీలక పాత్ర – ఆధునిక ఆవిష్క‌ర‌ణ‌ల‌తో అనుసంధానిస్తూ ముంద‌డుగు వేయాలి – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ సంస్కృతి, వారసత్వం, వాస్తుశిల్ప సంపద ప‌రిర‌క్ష‌ణ‌తో పాటు వాటిని భావితరాలకు చేరవేయడంలో యువతదే కీలక పాత్ర అని.. ఇందుకు దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వాన్ని ఆధునిక ఆవిష్కరణలతో అనుసంధానిస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత యువతపై ఉందని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

రైతులందరికీ శుభవార్త.. పంటల బీమా నమోదు గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు… : నెట్టెం రఘురాం

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద వరి మినహా అన్ని నోటిఫై చేసిన పంటలకు పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించడం రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయమని మాజీ మంత్రి, కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC Bank) చైర్మన్ నెట్టెం రఘురాం అన్నారు. శనివారం జగ్గయ్యపేటలోని కృష్ణ సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …

Read More »

పోషకాహార రంగం.. ఉపాధికి స్వర్ణద్వారం

– మ‌హిళల ఆర్థిక సాధికార‌త‌కు వినూత్న మార్గాలు – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార ఉత్పత్తులు, విలువ ఆధారిత ఆహార పదార్థాల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు వీటిని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. ఎన్‌టీఆర్ జిల్లా-రైజ్‌.. నేటివ్ టేబుల్‌, ఫిక్కీ ఎఫ్ఎల్‌వో విజ‌య‌వాడ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, గుంటుప‌ల్లి రైజ్ కేంద్రంలో శ‌నివారం స్వ‌యం స‌హాయ‌క …

Read More »

పేద‌ల సామాజిక భ‌ద్ర‌త‌కు ఎన్‌టీఆర్ భ‌రోసా

– అర్హుల ఇంటికే ప్ర‌భుత్వ సంక్షేమ ఫ‌లాలు – జిల్లాలో 2,24,793 మంది లబ్ధిదారులకు రూ. 98.12 కోట్లు – పెన్ష‌న్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌ర్ణాంధ్ర‌, వికసిత్ భార‌త్ ల‌క్ష్యాల సాధ‌న‌కు అనుగుణంగా పేద‌ల‌కు సామాజిక భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల ఫ‌లాల‌ను అర్హుల ఇంటివ‌ద్ద‌కే అందిస్తున్న‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు అన్నారు. శ‌నివారం ఆటోన‌గ‌ర్ స‌మీపంలోని …

Read More »

పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమిషనర్ ఎ. రవీంద్రరావు శనివారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన ప్రతి పింఛన్ లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో పింఛన్ అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్కిల్-3 పరిధిలోని సత్యం హోటల్ ప్రాంతంలో జరుగుతున్న పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. అక్కడ లబ్ధిదారులతో నేరుగా …

Read More »

NTR భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న ప్రభుత్వ విప్, MLA బొండా ఉమామహేశ్వరరావు 

-‘ఇంటింటికి తెలుగుదేశం’కు ప్రజల నుంచి విశేష ఆదరణ,ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేస్తాం -MLA బొండా ఉమ  విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ రామకోటి మైదానం, కుసుమ హరినాథ్ గుడి వద్ద, అలాగే 33వ డివిజన్ సత్యనారాయణపురం చల్లపల్లి వారి వీధి, కొమ్ము వారి వీధిలో శనివారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లను …

Read More »

డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్‌సీపీ పోరాటం… : వెలంపల్లి

-ఆగస్టు 2న పాల ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్‌లో సమావేశం -ఆగస్టు 6 నుండి 9 వరకు రిలే నిరాహార దీక్షలు -ఆగస్టు 10న భారీ ప్రదర్శన -విద్యార్థులు యువకులు పాల్గొని జయప్రదం చేయండి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ​డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమరశంఖం పూరిస్తున్నట్లు ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.ఈ ఉద్యమ కార్యాచరణను వివరించేందుకు స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ఆ పార్టీ …

Read More »

“విజయవాడ అభివృద్ధిలో రైల్వేది కీలక పాత్ర!”

-“విజయవాడ రైల్వే అభివృద్ధే లక్ష్యం..” -“8 ఆర్వోబీలు, అమృత్ భారత్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని కోరతాం” -“సౌత్ కోస్టల్ రైల్వే జీఎంను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ(రైల్వే స్టేషన్)విజయవాడ నగరంలో రైల్వే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నగరాన్ని దేశంలోనే ఆదర్శ రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ మాథుర్‌ను కలిసి విజయవాడతో …

Read More »

ప్రతి నెలా ఒకటో తేదీ… ప్రజలకు పండుగే!

-ఇంటి గుమ్మానికే పెన్షన్! -చెప్పిందే చేస్తాం… సంక్షేమమే మా బలం! -“సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు” -విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో డివిజన్ దూల్ పేట లో శనివారం నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ …

Read More »