Breaking News

“విజయవాడ అభివృద్ధిలో రైల్వేది కీలక పాత్ర!”

-“విజయవాడ రైల్వే అభివృద్ధే లక్ష్యం..”
-“8 ఆర్వోబీలు, అమృత్ భారత్ ప్రాజెక్టులపై కేంద్రాన్ని కోరతాం”
-“సౌత్ కోస్టల్ రైల్వే జీఎంను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ(రైల్వే స్టేషన్)విజయవాడ నగరంలో రైల్వే ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు, నగరాన్ని దేశంలోనే ఆదర్శ రైల్వే కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల్లో కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ మాథుర్‌ను కలిసి విజయవాడతో పాటు పరిసర ప్రాంతాలకు సంబంధించిన కీలక రైల్వే సమస్యలను వివరించారు..

అనంతరం ఎంపీ చిన్ని మీడియాతో మాట్లాడుతూ విజయవాడ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎనిమిది రైల్వే ఓవర్ బ్రిడ్జిల (RoBలు) నిర్మాణంపై జీఎంతో విస్తృతంగా చర్చించినట్లు ఎంపీ తెలిపారు. ముఖ్యంగా ఎర్రకట్ట వంతెన పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల ప్రజలకు అత్యంత కీలకమని, అలాగే గుణదల ఎల్‌సీ-8 వద్ద ఆర్వోబీ నిర్మాణం కూడా అత్యవసరమని స్పష్టం చేసినట్లు చెప్పారు. విజయవాడ రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు టెండర్లు పిలిచినా స్పందన రాకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్న ఎంపీ, ఈ ప్రాజెక్టు వేగవంతం అయ్యేలా కేంద్ర రైల్వే శాఖతో ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద మరింత అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రిని అన్ని ఎంపీలు కలిసి కోరనున్నట్లు తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజయవాడ–బెంగళూరు (గుత్తి మీదుగా) కొత్త రైలు సేవ ప్రారంభించాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరనున్నట్లు చెప్పారు. అదేవిధంగా కొండపల్లి రైల్వే స్టేషన్‌ను కూడా అమృత్ భారత్ పథకంలో చేర్చి అభివృద్ధి చేయాలని జీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే మరియు ప్రధానమైన స్టేషన్లలో విజయవాడ ఒకటనీ,,ఇది దేశంలోని నలుమూలలను కలిపే ప్రధాన రైల్వే మార్గాలకు కేంద్ర బిందువుగా ఉందని చిన్ని పేర్కొన్నారు.

“విజయవాడ అభివృద్ధికి రైల్వే కీలక బలం. నగరానికి అవసరమైన ప్రతి రైల్వే ప్రాజెక్టును కేంద్రంతో సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తాం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం” అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎన్.ఐ.డి. ప్రాంగణంలో 12వ జాతీయ చేనేత దినోత్సవ ముందస్తు వేడుకలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి సమీపంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ప్రాంగణంలో 12వ జాతీయ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *