-‘ఇంటింటికి తెలుగుదేశం’కు ప్రజల నుంచి విశేష ఆదరణ,ప్రజల ఆశీర్వాదాలతో మరింత సేవ చేస్తాం -MLA బొండా ఉమ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్ రామకోటి మైదానం, కుసుమ హరినాథ్ గుడి వద్ద, అలాగే 33వ డివిజన్ సత్యనారాయణపురం చల్లపల్లి వారి వీధి, కొమ్ము వారి వీధిలో శనివారం నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని అర్హులైన వృద్ధులు, వికలాంగులు, వితంతు మహిళలకు పెన్షన్లను అందజేశారు.
ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు.
ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటలకే వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సామాజిక భద్రతా పింఛన్లను ఇంటి వద్దే అందిస్తూ దేశంలోనే ఆదర్శంగా నిలిచామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను రూ.4,000కు, వికలాంగుల పింఛన్‌ను రూ.6,000కు పెంచి అందిస్తున్నామని పేర్కొన్నారు.
అదేవిధంగా మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హులైన ప్రతి విద్యార్థికి లబ్ధి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు.
ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు నియోజకవర్గ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంలో ప్రజల గడపగడపకు వెళ్లిన ప్రతిచోటా కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పారదర్శక, ప్రజా సంక్షేమ పాలనను మరింత బలోపేతం చేస్తూ ప్రజల ఆశీర్వాదాలతో మరింత కష్టపడి పనిచేస్తామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులందరూ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, మాజీ కార్పొరేటర్ ముప్పొ వెంకటేశ్వరరావు, 33వ డివిజన్ ఇంచార్జ్ గార్లపాటి విజయ కుమార్, డివిజన్ అధ్యక్షులు నాలం కోటేశ్వరరావు, పొట్లూరి కృష్ణప్రసాద్, చిలువేరు శ్రీనివాస్, 36వ డివిజన్ అధ్యక్షులు మద్దినేని సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి నందేటి లక్ష్మీనారాయణ సింగ్, నాగయ్య, సోమన అనిల్, కుమార్, శోభనా చలం, కుందా వెంకటేశ్వరరావు, వల్లూరు సుబ్బారావు, యాబాజీ మహేష్, దారపనేని సతీష్ చంద్రమౌళి, ఇన్చార్జి ఇమ్మడి శ్రీరాం ప్రసాద్ బీజేపీ మండల అధ్యక్షుడు నమ్మి హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News