-వీఈఆర్ ప్లానింగ్ కోసం ఆంధ్రా యూనివర్శిటీ సేవలు -విశాఖ ఎకనామిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి మైక్రో ప్లానింగ్ -ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీపై దృష్టి సారించడం ద్వారా విశాఖ ప్రాంత అభివృద్ధి -విశాఖ ఎకనమిక్ రీజియన్ అభివృద్ధి ప్రణాళికల సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ ఎకనమిక్ రీజియన్ సమగ్రాభివృద్ధికి సూక్ష్మ స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాలను, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకుంటూ పూర్తి స్థాయి అభివృద్ధి ప్రణాళిక చేయాలని …
Read More »Daily Archives: August 5, 2026
స్వయం ఏపీ బ్రాండ్ ఉత్పత్తులకు మార్కెటింగ్ పై మంత్రి కొండపల్లి సమీక్ష
– MSME DPR యాప్‌ను స్త్రీ నిధి యాప్‌తో అనుసంధానంపై చర్చ – ప్రాసెసింగ్ చార్జీల మాపీపై SHG మహిళలకు అవగాహన కల్పించాలన్న మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్వయం ఏపీ బ్రాండ్ కింద SHG మహిళలు తయారు చేసిన 65 ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం మంత్రి విజయవాడలోని తన క్యాంప్ …
Read More »చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించడం మన లక్ష్యం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (NID) ఆధ్వర్యంలో బుధవారం జాతీయ చేనేత దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ప్రత్యేకంగా NID విద్యార్థులచే ఆకర్షణీయమైన చేనేత ఫ్యాషన్ షో,డిజైనింగ్ లో పలు పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వీవర్స్ సర్వీస్ సెంటర్ డీడీ అనస్ షా. బి. మాట్లాడుతూ భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ, డెవలప్‌మెంట్ కమిషనర్ (చేనేత) కార్యాలయం పరిధిలోని చేనేత సేవా కేంద్రం (WSC), విజయవాడ ఆధ్వర్యంలో 12వ జాతీయ చేనేత దినోత్సవంను ఘనంగా జరుపుకుంటున్నామని …
Read More »ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష
-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి పనుల్లో వేగవంతం చేయాలని సూచించిన మంత్రి -పనులు వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు బిల్లులను త్వరితగతిన చెల్లిస్తామని మంత్రి హామీ. -రాష్ట్రంలో రూ.72,688 కోట్ల విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులకు భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం. -ఆర్ & బీ శాఖ అభివృద్ధి పనులను ప్రజలకు చేరవేసేందుకు అధికారిక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన మంత్రి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »ప్రభుత్వ ఐటీఐలలో ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి. రమేశ్ బాబు, జనరల్ సెక్రటరీ కే. రత్నరాజు, ఉపాధ్యక్షులు టి. కృష్ణ కిషోర్ బుధవారం సచివాలయంలో సిఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి సంఘం తరఫున పలు కీలక అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఖాళీగా …
Read More »మత్స్యకారులకు చారిత్రక భరోసా… బీమా, సబ్సిడీ, భృతిలో కూటమి ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు
– గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బీమా పరిహారాలన్నీ చెల్లింపు – విద్యుత్ సబ్సిడీలో భారీ పెంపు – మత్స్యకారుల సంక్షేమంలో కూటమి ప్రభుత్వమే ఆదర్శం… వైసీపీ నిర్లక్ష్యానికి గణాంకాలే సాక్ష్యం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమాన్ని అత్యున్నత ప్రాధాన్యంగా తీసుకుని కూటమి ప్రభుత్వం చారిత్రక నిర్ణయాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి అంశంలోనూ న్యాయం చేస్తూ, మత్స్యకార కుటుంబాలకు …
Read More »కొత్త రోడ్లతో కళకళలాడుతున్న పిఠాపురం నియోజకవర్గం
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గ్రామీణ రోడ్లకు మహర్దశ -రూ. 207 కోట్లతో 307 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణ ప్రణాళిక -రెండేళ్లలో రూ. 100 కోట్లతో 611 రోడ్ల నిర్మాణం పూర్తి -పురోగతిలో మరో 70 రోడ్లు.. బ్రిడ్జిల నిర్మాణం.. -బడి, గుడి, ఆసుపత్రులను అనుసంధానిస్తూ రహదారులు -తీర ప్రాంత మత్స్యకార కాలనీల్లో సీసీ రోడ్ల వెలుగులు -వరుస తుపాన్లకు కొట్టుకుపోయిన అమరవిల్లి రోడ్డు పునరుద్ధరణ -8 వేల మంది ప్రయాణ కష్టాలు తీర్చిన కొండెవరం రోడ్డు నిర్మాణం -పల్లెపండుగ 2.0 …
Read More »గోదావరిలో ఏస్నాన ఘట్టంలో స్నానం చేసినా పుణ్యం వస్తుందనే విశ్వాసం భక్తుల్లో కల్పించాలి
-స్నాన ఘట్టాలవారీ భక్తుల రద్దీ నిర్వహణకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయండి -“స్నానం-దానం-పితృతర్పణం”వంటి నినాదాలతో పుష్కరాల విశిష్టను తెలియజేయాలి -మఠాధిపతులు,పీఠాధిపతులు,ప్రముఖ ప్రవచనకర్తల సూచనలు సలహాలు తీసుకోండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న గోదావరి పుష్కరాల సమయంలో గోదావరి నది వెంబడి ఏస్నాన ఘట్టంలో పుష్కర స్నానం ఆచరించినా పుణ్యం లభిస్తుందనే విశ్వాసాన్ని భక్తుల్లో కల్పించేందుకు ఇప్పటి నుండే తగిన కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ అధికారులను ఆదేశించారు.గోదావరి …
Read More »ప్రైవేట్ ఆయుష్ ఆసుపత్రుల నిర్వహణపై తొలిసారిగా ముసాయిదా నిబంధనలు విడుదల
-రెండు నెలల కసరత్తు అనంతరం తయారైన ముసాయిదా -చిన్న క్లినిక్ నుంచి పెద్దాసుపత్రుల వరకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -నిబంధనలు పాటించకుంటే జరిమానాలు.. అనివార్యమైతే గుర్తింపు రద్దు కూడా -కొత్త ముసాయిదాపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సమీక్ష -ప్రజలు, వైద్యులు, మేధావులు, నిపుణుల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని అధికారులకు ఆదేశాలు -అనంతరమే ముసాయిదా ఖరారు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఆయుర్వేదం, హోమియోపతి, యునానీ, సిద్ధ, యోగా-ప్రకృతి వైద్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ క్లినిక్‌లు, పాలీక్లినిక్‌లు, నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ …
Read More »పొగాకు రైతుల సంక్షేమంపై జగన్‌మోహన్‌రెడ్డికి బహిరంగ సవాల్
-వాస్తవాలు, గణాంకాలతో చర్చకు సిద్ధమా జగన్? రైతుల కోసం చేసింది ఎవరు? మాటలు చెప్పింది ఎవరు? ప్రజల ముందే తేల్చుకుందాం – మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పొగాకు రైతుల సంక్షేమంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలపై ఆధారపడినవని, రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు, గణాంకాలతో బహిరంగ చర్చకు రావాలని జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బహిరంగ సవాల్ విసిరారు. బుధవారం విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్ …
Read More »
Prajavartha Online Telugu News