అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీఐ స్టాఫ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.వి. రమేశ్ బాబు, జనరల్ సెక్రటరీ కే. రత్నరాజు, ఉపాధ్యక్షులు టి. కృష్ణ కిషోర్ బుధవారం సచివాలయంలో సిఎస్ ని మర్యాద పూర్వకంగా కలిసి సంఘం తరఫున పలు కీలక అంశాలపై వినతిపత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఐటీఐలలో ఖాళీగా ఉన్న సుమారు 400 అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ (ATO) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అదేవిధంగా కోస్తా ఆంధ్ర ప్రాంతంలో దాదాపు 10 కొత్త ప్రభుత్వ ఐటీఐలను స్థాపించాలని, ప్రస్తుతం ఉన్న డీఎల్‌టీసీ (DLTC)లను ఐటీఐలుగా పేరు మార్చాలని, అలాగే ప్రభుత్వ ఐటీఐలలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సుమారు 290 మంది ఏటీఓల సమస్యలను తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశాలన్నింటినీ సిఎస్ సానుకూలంగా పరిశీలించాలని సంఘం నాయకులు కోరారు.
Prajavartha Online Telugu News