Breaking News

రాజమహేంద్రవరం అభివృద్ధికి పెద్దపీట

-తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు ప్రధాన రహదారి విస్తరణ, డ్రైన్ల నిర్మాణానికి చర్యలు : ఎమ్మెల్సీ సోము వీర్రాజు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా నగర అభివృద్ధి పనులపై శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) సోము వీర్రాజు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు తారకరామ నగర్ నుండి రూపా నగర్, కృష్ణా నగర్ వరకు గల ప్రధాన రహదారి విస్తరణ, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం మరియు ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, వేగంగా విస్తరిస్తున్న రాజమహేంద్రవరం నగరంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. తారకరామ నగర్ – రూపా నగర్ – కృష్ణా నగర్ మార్గంలో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, అలాగే వర్షాకాలంలో ముంపు సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా డ్రైన్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నాణ్యతా ప్రమాణాలతో పనులను నిర్దేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం నగర సర్వతోముఖ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా  సోము వీర్రాజు పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం టౌన్ ప్లానింగ్ అధికారులు, రుడా చీఫ్ ప్లానింగ్ అధికారి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఇతర సంబంధిత అధికారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *