విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ పాలకవర్గం ఎన్నికల్లో అన్నే శివనాగేశ్వరరావు ప్యానల్ ఘన విజయం సాధించింది. పాలక వర్గంలోని ఐదు కార్యవర్గ పదవులతోపాటు 13 మెంబర్ పదవులను గెలుచుకుంది. ఐలా పాలకవర్గం ఎన్నికలు ఆటోనగర్ లోని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు జరిగాయి. మొత్తం 1,183 ఓట్లకు గాను 883 ఓట్లు పోలయ్యాయి. అంటే 74.5 శాతం పోలింగ్ నమోద యిందని ఎన్నికల అధికారి ముత్యాల దొరబాబు ప్రకటించారు. ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ బాబ్జి ఎన్నికల సరళిని పరిశీలించారు.
విజేతలు వీరే..
జవహర్ ఆటోనగర్ ఐలా సర్వీస్ సొసైటీ చైర్మన్ గా అన్నే శివనాగేశ్వరరావు 293 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వైస్ చైర్మన్ గా సుంకర దుర్గాప్రసాద్ 308 ఓట్లతో, కార్యదర్శిగా అబ్దుల్ కలాం 311 ఓట్లతో, సహాయ కార్యదర్శిగా పంచుమర్తి ప్రసాదరావు 299 ఓట్లతో, కోశాధికారిగా కత్తిక శివనాగేశ్వరరావు 307 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మెంబర్లుగా పవన్ కుమార్ (1వ వార్డు), మొహి ద్దీన్ ఖాన్ (2వ వార్డు), దండాబత్తుల రాంబాబు (4వ వార్డు), గంధం వెంకటేశ్వరరావు (5వ వార్డు), సంపర చిన్నారా వు (6వ వార్డు), తిరుమాని వెంకట నారా యణ (7వ వార్డు), టీబీఎస్ఆర్ సాంబశివరావు (8వ వార్డు), షేక్ బాజీ షరీఫ్ (9వ వార్డు), షేక్ దస్తగిరి (10వ వార్డు), ఎన్.మార్కండేశ్వరరావు (11వ వార్డు), కె.హరి వెంకట వరప్రసాద్ (12వ వార్డు) మెంబర్లుగా ఎన్నికయ్యారు. కాగా 3వ వార్డుకు పి.రాజగోపాల్, 13వ వార్డుకు కె.తవిటిరాజు ఏకగ్రీవమయ్యారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News