గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో లే అవుట్ రెగ్యులేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు అందిన దరఖాస్తులను ఈ నెల 17లోపు నూరు శాతం పరిష్కరించాలని సిటీ ప్లానర్ రాంబాబు స్పష్టం చేశారు. నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదేశాల మేరకు గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు పట్టణ ప్రణాళిక అధికారులు మరియు సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుత వార్ద్ సచివాలయాల వారీగా ప్లానింగ్ కార్యదర్శులు తమ లాగిన్ లలోని లే అవుట్ రెగ్యులేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) అప్లికేషన్ల వివరాలు మరియు ఇన్ ప్రిన్సిపల్ లేఔట్ ప్యాట్రన్ (ఐ.పి.ఎల్.పి) దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిటీ ప్లానర్ మాట్లాడుతూ, ఈ నెల 15 లోగా ఐ.పి.ఎల్.పి మరియు 17 లోపు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఎటువంటి తప్పులు లేకుండా నూరు శాతం పరిష్కరించాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారంలో సమస్యలు సందేహాలు ఏమైనా ఉంటె అధికారులను సంప్రదించి, సందేహాలను నివృత్తి చేసుకొని సదరు దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అలాగే నగరంలో ఆక్రమణల తొలగింపు పై కార్యదర్శులు మరియు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ప్రతి రోజు జరగాలన్నారు. ముఖ్యంగా ప్రజల వద్ద నుండి వచ్చే పిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, వాటిని నిర్దేశిత సమయానికి పరిష్కరించాలన్నారు.
Prajavartha Online Telugu News