తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆదివారం తొట్టంబేడు మండలం సి.ఆర్.ఎన్. కండ్రిగ గ్రామంలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంస్థల ప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.
అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సి.ఆర్.ఎన్. కండ్రిగలోని సి.సి.ఎన్. కన్వెన్షన్ హాల్‌లో జరిగే వివాహ మహోత్సవ కార్యక్రమానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోలా ఆనంద్, తిరుపతి నగర సంస్థ కమిషనర్ జయకృష్ణ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ సాయి, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద అవసరమైన భద్రతా, ప్రోటోకాల్ ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News