విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టీ.ఎన్.టి.యూ.సీ. రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ ని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభి రామ్ పరామర్శించారు. ఇటీవల పరుచూరి ప్రసాద్ కి కాళ్లకు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలుసుకున్న చైర్మన్ పట్టాభి రామ్, ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన నివాసానికి వెళ్లి పరుచూరి ప్రసాద్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను తెలుసుకుని, ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పట్టాభి రామ్ మాట్లాడుతూ, *తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కార్యకర్తల కష్టసుఖాల్లో తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని* తెలిపారు. పరుచూరి ప్రసాద్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News