విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా నియమితులైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావుతో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో లోక్ భవన్ దర్బార్ హాల్ లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేయించారు. జిఏడి ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు, కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఆ తర్వాత లోకాయుక్త రిజిస్ట్రార్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జునరావును నియమిస్తూ గవర్నర్ జారీ చేసిన అపాయింట్‌మెంట్ వారెంట్‌ను …
Read More »Daily Archives: August 25, 2026
అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు
-భక్తులకు అత్యుత్తమ సౌకర్యాలు, పవిత్రతకు పెద్దపీట -10 కోట్ల మంది పుణ్య స్నానాలు చేస్తారని అంచనా -181 కొత్త ఘాట్ల నిర్మాణంతో సహా 440 ఘాట్ల అభివృద్ధి -మొత్తం రూ.4,026 కోట్ల వ్యయంతో 4,932 పనులు -గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని …
Read More »రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన
-రూ.10వేల కోట్ల పెట్టుబడి, 1,325 మెగావాట్ల సామర్థ్యం -4వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్న సుజ్లాన్ సంస్థ -సుజ్లాన్ S144 న్యూ బ్లేడ్ ప్రొడక్షన్ లైన్స్ ను ప్రారంభించిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : పవన విద్యుత్ రంగంలో ఏపీకి పెద్దఎత్తున పెట్టుబడులు తరలివస్తున్నాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలం హులికెర గ్రామం వద్ద సుజ్లాన్ 1,325 మెగావాట్ల విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం …
Read More »సుజ్లాన్ రాకతో ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ పెరిగింది
-పవన విద్యుత్ రంగంలో సుజ్లాన్‌కు ప్రపంచ ఖ్యాతి -175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యం -ఏపీ వ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీలో 22 క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం -ఏపీ-సుజ్లాన్ భాగస్వామ్యంతో 12వేల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ -అనంతపురం అంటే కియా కార్లు, ఫైటర్ జెట్లు, సుజ్లాన్ రెన్యువబుల్ ఎనర్జీ -రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి లోకేష్ రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీని నంబర్ వన్‌గా నిలబెట్టడమే మన లక్ష్యమని, …
Read More »హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల కృష్ణారావుకు ఘన వీడ్కోలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావుకు హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సమక్షంలో ఫుల్ బెంచ్ ఘన వీడ్కోలు పలికింది.హైకోర్టు న్యాయమూర్తి గోపాల కృష్ణారావు పదవీ విరమణ చేయనున్న సందర్భాన్ని పురష్కరించుకుని మంగళవారం హై కోర్టు మొదటి కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ మాట్లాడుతూ జస్టిస్ గోపాల కృష్ణారావు నిబద్ధత కలిగిన న్యాయమూర్తని …
Read More »ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (PMFME)అమలు లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి అవార్డు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ అఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ సీడ్ క్యాపిటల్ మరియు హైయ్యర్ ఆర్డర్ ఎంటర్ప్రైజెస్ రుణాలు అందచేయడంలో, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) , ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయి అవార్డును మంగళవారం కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ న్యూఢిల్లీలో అందజేశారు. ఈ నెల ఆగస్టు 24, 25 తేదీలలో కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఇండియా హేబిటేడ్ సెంటర్ న్యూఢిల్లీ నందు నిర్వహించిన దేశవ్యాప్త …
Read More »ఏపీ మున్సిపల్ శాఖ – యూకే ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
-పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్దికి గవర్నమెంట్ – గవర్నమెంట్ ఎంఓయూ -అమరావతిని వరల్డ్ క్లాస్ స్మార్ట్, లివబుల్ సిటీగా అభివృద్ధి చేయడంలో యూకే నైపుణ్యం, సాంకేతిక సహకారం -సస్టైనబుల్ అర్బన్ డెవలప్‌మెంట్, ఆధునిక టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అర్బన్ మొబిలిటీపై కలిసి పనిచేయనున్న ఏపీ–యూకే -మునిసిపాలిటీల్లో రూ.40 వేల కోట్ల మౌలిక వసతుల పనులకు ప్రపంచస్థాయి సాంకేతికత వినియోగం -మీడియాతో మంత్రి నారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిని అంతర్జాతీయ నైపుణ్యం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సుస్థిర మౌలిక వసతులతో మరింత …
Read More »రెండేళ్లలో స్వర్ణాంధ్ర @2047కి బాటలు.. డేటా ఆధారిత అభివృద్ధి, సమర్థ పాలనకు APSDPS కీలక భూమిక
-175 నియోజకవర్గాల నుంచి 28 జిల్లాల వరకు.. అభివృద్ధికి డేటా ఆధారిత ప్రణాళిక -విజన్ నుంచి గ్రౌండ్ యాక్షన్ వరకు.. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలిక అభివృద్ధి హామీలను క్షేత్రస్థాయి వాస్తవాలుగా మార్చే బలమైన ప్రయత్నంలో భాగంగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మక ‘స్వర్ణాంధ్ర @2047’ రోడ్‌మ్యాప్ కోసం ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)’ ని కేవలం రెండేళ్ల వ్యవధిలోనే ప్రధాన అమలు సాధనంగా తీర్చిదిద్దింది. ముఖ్యమంత్రి ‘పది సూత్రాల’ మార్గదర్శకత్వంలో, …
Read More »ఈనెల 27, 28 తేదీల్లో అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27,28 తేదీల్లో అసెంబ్లీ కమిటీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన సభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సమావేశం కానుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ తెలియజేశారు.వాస్తవానికి ఈకమిటీ సమావేశం ఈనెల 26,27 తేదీల్లో జరగాల్సి ఉండగా 26వతేదీ మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఈసమావేశాన్ని ఈనెల 27,28 తేదీలకు మార్పు చేశారు.ఈకమిటీ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థల(పబ్లిక్ అండర్ టేకింగ్స్(పిఎస్ యులు)కు సంబంధించి గత ఐదేళ్ళ …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు ముమ్మరం
– 15 కోస్ట్‌గార్డ్ నౌకలు, నాలుగు హెలికాప్టర్లతో విస్తృత సెర్చ్ ఆపరేషన్ – మయన్మార్, బంగ్లాదేశ్ సముద్ర అధికారులకు సమాచారం.. ఎలక్ట్రానిక్ నిఘా కొనసాగింపు – డైమండ్ హార్బర్, సుందర్‌బన్స్ పరిసరాల్లోనూ గాలింపు విస్తరణ – మత్స్యకారులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు అన్ని అవకాశాలను వినియోగిస్తున్నాం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమలాపురం ప్రాంతానికి చెందిన గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …
Read More »
Prajavartha Online Telugu News