Breaking News

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ని మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కొండపల్లి బొమ్మల విశిష్టత, వాటి చారిత్రక ప్రాధాన్యం, సంప్రదాయ కళాకారుల జీవనోపాధి పరిరక్షణ, హస్తకళల అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు. కొండపల్లి క్రాఫ్ట్ విలేజ్‌ను మరింత అభివృద్ధి చేసి, దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, ఆధునిక సౌకర్యాలు అభివృద్ధి చేయడం, విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టడం, సంప్రదాయ కళాకారులకు ప్రోత్సాహక చర్యలు అందించడం వంటి అంశాలపై డా. హరిప్రసాద్ తన అభిప్రాయాలను కలెక్టర్‌కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *