Breaking News

ప్రైమ్ వాలీబాల్ లీగ్ ట్రయల్స్‌ లో సత్తా చాటి ఉన్నత స్థాయికి చేరుకోవాలి… : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-కార్యక్రమంలో పాల్గొన్న పెనమలూరు టీడీపీ నాయకులు వెంకట, ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమణ, బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రైమ్ వాలీబాల్ లీగ్ సెలెక్షన్ ట్రయల్స్‌ను విజయవాడలోని విఆర్ సిద్ధార్థ కాలేజీ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ బ్లాక్ హాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్-21 & ఓపెన్ వాలీబాల్ ట్రయల్స్ నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ట్రయల్స్‌కు వచ్చిన క్రీడాకారులకు స్వాగతం పలికారు. ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చి ప్రైమ్ వాలీబాల్ లీగ్‌లో ఆడే అవకాశాన్ని ప్రతి క్రీడాకారుడు అందిపుచ్చుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ బాక్స్ వ్యవస్థాపకులు అభిషేక్ రెడ్డి గారు, టెక్నికల్ ఆర్గనైజర్ తులసి రెడ్డి, సిద్ధార్థ కాలేజ్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్, క్రీడాకారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *