గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కు సంబంధించి వారం రోజుల వ్యవధిలో నో మ్యాపింగ్, ఎనామిల్ ఓటర్లకు నోటీసులు జెనరేట్ చేసి, పంపిణీ చేయడం జరగాలని, విచారణ మరియు పరిష్కారం ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈ.ఆర్.ఓ మరియు నగర కమిషనర్ కే. మయూర్ అశోక్ ఏ.ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. గురువారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్సు హాల్ నందు ఏ.ఈ.ఆర్.ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 38,550, పశ్చిమ నియోజకవర్గంలో 37,527 నో మ్యాపింగ్, ఎనామిల్ ఓట్లను గుర్తించడం జరిగిందన్నారు. గుర్తించిన వీరందరికీ బి.యల్.ఓలు నోటీసులు పంపిణీ చేయడం, విచారణ పక్కాగా చేయడం ఏ.ఈ.ఆర్.ఓలు పర్యవేక్షణ చేయాలన్నారు. విచారణ వాటికి ఏ.ఈ.ఆర్.ఓలు గా ప్రత్యక్షంగా హాజరుకావాలని స్పష్టం చేశారు. ఓటర్లు సర్ ముసాయిదా పై అభ్యంతరాలు అందించడానికి వీలుగా ఏ.ఈ.ఆర్.ఓల పరిధిలో ఒక సెంటర్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అలాగే ఏరోజుకు ఆరోజు అందే అభ్యంతరాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో సర్ కు సంబంధించి మొదటి డ్రాఫ్ట్ పబ్లికేషన్ పూర్తైయ్యిందని, దీనికి సంబంధించి ప్రజల వద్ద నుండి నూతన దరఖాస్తులు మరియు అభ్యంతరాలు వస్తాయని వాటినన్నిటిని ఏ.ఈ.ఆర్.ఓలు అప్ లోడ్ చేయాలన్నారు. నోటీసులు డిస్పోజల్ చేసిన అనంతరం దానికి సంబంధించిన ఎక్నాలేడ్జ్మెంట్ ను అప్ లోడ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియకు స్తానికంగా ఉండే బి.యల్.ఏ ల సహకారం తీసుకోవాలని తెలియచేశారు.
సమావేశంలో పశ్చిమ నియోజకవర్గ ఈ.ఆర్.ఓ మరియు అదనపు కమిషనర్ కిషోర్, డిప్యుటీ కమిషనర్లు బి. శ్రీనివాసరావు, సాంబశివరావు, సిటీ ప్లానర్ రాంబాబు, డి.సి.పి సూరజ్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్లు నాగమల్లేశ్వరావు, సుధా కిరణ్మై, ఏ.ఈ.ఆర్.ఓలు, ఎలక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News