Breaking News

స్థానిక ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కసరత్తు

-క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘ చర్చ
-కూటమి సమన్వయమే కీలకం.. గెలుపే లక్ష్యంగా కార్యాచరణ
-పల్లా శ్రీనివాసరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలపై కీలకంగా చర్చించినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. భోగాపురం విమానాశ్రయం సమీపంలోని ప్రైవేట్‌ రిసార్టులో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో కూటమి శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా క్షేత్రస్థాయి కార్యాచరణ, పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహాలపై సమావేశంలో చర్చించినట్లు పల్లా వెల్లడించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు, కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసికట్టుగా పనిచేస్తే స్థానిక సంస్థల్లో కూటమి బలం మరింత పటిష్టమవుతుందని పల్లా పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *