-మలి విడత ల్యాండ్ పూలింగ్ రైతులకు కనీస కౌలు రూ. 40వేలు
-రాష్ట్ర మంత్రి పి.నారాయణ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాజధాని అమరావతి నడిబొడ్డున అత్యంత ఎత్తైన భవన నిర్మాణాల్లో ఒకటైన అసెంబ్లీ(ఐకానిక్ భవనం) స్పైర్(250 మీటర్లు) నిర్మాణానికి టెండర్లు పిలవడానికి రూ.661 కోట్లకు పరిపాలనామోదం ఇవ్వడం జరిగిందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు పొంగూరు నారాయణ తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 66వ సీఆర్డీఏ అథారిటీ సమవేశం వివరాలను ఏపీ సచివాలయం లోని ప్రచార విభాగంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వెల్లడించారు.రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో సైతం మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఒక వ్యక్తికి 135 లీటర్లు అందించడానికి అవసరమైన పైపుల సామర్థ్యం పెంపు, మెయిన్ డ్రైనేజీకి లింక్ డ్రైనేజీ పైపులు ఏర్పాటు, ఎన్ఎస్పీ(నెగోషియేటివ్ సెటిల్మెంట్ పాలసీ) తో కలిపి రూ. 1548 కోట్లు తో టెండర్లు పిలవడానికి పరిపాలనా అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.రాష్ట్రంలో స్టాండర్ట్స్ ప్రైవేట్ స్కూల్స్ కూడా రాజధాని ప్రాంతంలో నిర్మాణానికి అనుమతులు ఇచ్చామన్నారు. అందులో భాగంగానే నలందా ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వారికి 5 ఎకరాలు కృష్ణాయపాలెంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఏడాదిన్నరలో స్కూల్ నిర్మాణం పూర్తవనుందని మంత్రి తెలిపారు. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కార్యాలయ నిర్మాణానికి నేలపాడులో 50 సెంట్లు భూమి కేటాయించడం జరిగిందన్నారు. ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇచ్చిన రైతులకు ఎకరాకు కౌలు జరీబు అయితే రూ. 50వేలు, నాన్ జరీబు అయితే రూ. 40వేలు అందిస్తున్నామన్నారు. 2014-19 మధ్యలో భూ సమీకరణలో భాగంగా భూములు ఇచ్చిన ఎకరం కంటే తక్కువ ఉన్నా గతంలో వారికి రూ. 30వేలు ఇచ్చామన్నారు. రెండో విడత భూ సమీకరణ సందర్భంగా రైతుల విజ్ఞప్తి మేరకు వారికి కూడా కౌలు రూ. 40వేలు ఇవ్వడానికి అథారిటి అనుమతి లభించిందన్నారు.
అక్టోబర్ చివరి నాటికి రెవెన్యూ సమస్యలను సైతం పరిష్కరించి ల్యాండ్ పూలింగ్ 80 శాతం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు.
Prajavartha Online Telugu News