Breaking News

Daily Archives: September 18, 2026

అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమైన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులతో ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.ఈ నెల 21వ తేదీన వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, రాష్ట్రంలో DSC అక్రమాలపై CBI విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ నిర్వహించనున్న శాంతియుత ర్యాలీని …

Read More »

లేబ‌ర్ క్యాంపులలో మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాలి…

-తుళ్లూరు ఆర్వీఆర్ క్యాంపును సంద‌ర్శించిన ఏడీసీ సీఎండీ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌కు పొరుగు ప్రాంతాల నుంచి కుటుంబాల‌తో వ‌స్తున్న కార్మికుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) సీఎండీ డి.లక్ష్మీపార్థ‌సార‌థి వారు అధికారుల‌ను ఆదేశించారు. శుక్ర‌వారం రాజ‌ధాని తుళ్లూరులోని ఆర్వీఆర్ లేబ‌ర్ క్యాంపును ఆమె సంద‌ర్శించారు. అక్క‌డ కార్మికుల‌కు క‌ల్పిస్తున్న వ‌స‌తుల‌పై స్వీయ ప‌రిశీల‌న జ‌రిపారు. అందులో మ‌హిళలతో సౌక‌ర్యాల క‌ల్ప‌న‌పై అడిగి తెలుసుకున్నారు. ప‌డ‌క గ‌దుల‌లో స‌రైన సౌక‌ర్యాలు లేక‌పోవ‌టంతో సంబంధిత గుత్తేదారు …

Read More »

బయటి ఆహారాలతో కేన్సర్…

-పి.బి. సిద్ధార్థలో ఐఐటి ప్రొఫెసర్ శ్రీరామ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతివ్యక్తికి శరీరవిజ్ఞానం అవసరమని, శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగితే  కణజాలంపై ప్రభావం పడి ప్రాణానికే ప్రమాదం కలుగుతుందని, బయటి ఆహారాల వల్ల వచ్చే వ్యాధుల్లో కేన్సర్ ఒకటని ఐఐటి గాంధీనగర్ (గుజరాత్) ఆచార్యులు, సిద్ధార్థ పూర్వ విద్యార్థి డాక్టర్ జి. శ్రీరామ్ అన్నారు. పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కెమిస్ట్రీ విభాగం శుక్రవారం సెమినార్ హాలులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆచార్య శ్రీరాం మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు …

Read More »

సుస్థిర ఆర్థిక వృద్ధికి వ్యూహాత్మ‌క అడుగులు..

– అమ‌రావ‌తి ఎక‌న‌మిక్ రీజియ‌న్‌తో స‌రికొత్త పారిశ్రామిక స్వ‌రూపం – ఏఈఆర్‌లో ఎన్‌టీఆర్ జిల్లా భాగం కావ‌డం గ‌ర్వ‌కార‌ణం – అన్ని రంగాల్లో సామ‌ర్థ్యాల స‌ద్వినియోగం అత్యంత కీల‌కం – క్ల‌స్ట‌ర్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధిపైనా ప్ర‌త్యేక దృష్టి – ప్ర‌త్యేక వ‌ర్క్‌షాప్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు అమ‌రావ‌తి ఎక‌న‌మిక్ రీజియ‌న్ (ఏఈఆర్‌)తో స‌రికొత్త ఊపు రానుంద‌ని.. పారిశ్రామిక రూపురేఖలు పూర్తిగా మార‌నున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. అమరావతి …

Read More »

పచ్చదనంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు

-మొక్కలు నాటి సంరక్షించాలి.. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పాటులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు. నెట్ జీరో–ఆరోగ్యకరమైన క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామంలోని గురుకుల పాఠశాలలో “అనంత ఆరణ్య ప్లాంటేషన్” కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తోకలిసి ముఖ్య అతిథిగా …

Read More »

కెమెరా వెనుక నిలిచి.. చరిత్రను ముందుకు చూపి..

– క‌నిపించే దృశ్యానికి కళారూపం.. ఫొటోగ్రాఫర్‌ ప్రతిభకు ప్రతిరూపం – స‌మాజంలో ఫొటో జ‌ర్న‌లిస్టుల పాత్ర అత్యంత కీల‌కం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒక క్షణాన్ని కెమెరాలో బంధించి, దాన్ని శాశ్వత జ్ఞాపకంగా నిలిపే శక్తి ఫొటోగ్రాఫర్లకు ఉందని జిల్లా కలెక్టర్‌ డా. జి.లక్ష్మీశ అన్నారు. ఒక క్ష‌ణాన్ని శాశ్వతంగా బంధించి ఆ క్షణంలోని భావోద్వేగాన్ని, సంఘటనను, చరిత్రను భావితరాలకు అందించే అద్భుతమైన కళ ఫొటోగ్రఫీ అని పేర్కొన్నారు. ప్ర‌పంచ ఫొటోగ్ర‌ఫీ దినోత్స‌వాన్ని పురస్కరించుకుని …

Read More »

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

-‘ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు’ కార్యక్రమంలో నమోదైన అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి -ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా తప్పనిసరిగా పరిష్కరించాలి -క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ప్రజలకు సత్వర న్యాయం అందించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ చందర్లపాడు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి అర్జీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. ప్రజా సమస్యలను కేవలం అర్జీల పరిష్కారంగా కాకుండా, …

Read More »

నూతన పింఛన్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు

-అర్హత కలిగిన ప్రతి దరఖాస్తును నిబంధనల మేరకు పరిశీలించి ఆన్‌లైన్‌లో అప్రూవ్ చేయాలి -పింఛన్ మంజూరు కోసం లబ్ధిదారుల నుంచి డబ్బులు డిమాండ్ చేసినా, ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసినా కఠిన చర్యలు -స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బంది పనితీరును ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సామాజిక భద్రతా పింఛన్ పథకంలో భాగంగా పెంచిన పింఛన్ మొత్తాలను లబ్ధిదారులకు అందజేయడంతో పాటు, నూతనంగా …

Read More »

పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ చారిత్రాత్మకం

-అడిషనల్ క్వాంటం తో నాలుగు లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి -2022లో రద్దు చేసిన అడిషనల్ క్వాంటం పునరుద్ధరణపై హర్షం -రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పెన్షనర్లు -రాష్ట్ర ఎన్జీఓ నేతలు ఎ .విద్యాసాగర్,డి .వి రమణను ఘన సన్మానించిన పెన్షనర్లు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం పెన్షనర్లు కు తీవ్ర నష్టం చేస్తూ 2022 లో నిలిపివేయబడిన అడిషనల్ క్వాంటం పెన్షన్‌ను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం పెన్షనర్ల జీవితాలలో వెలుగులు నింపిందని దీనివల్ల రాష్ట్రంలోని …

Read More »

అన్న క్యాంటీన్లలో ఎటువంటి నిర్వహణ లోపాలు లేకుండా ఆహారం అందించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని అన్న క్యాంటీన్లలో ఎటువంటి నిర్వహణ లోపాలు లేకుండా ఆహారం అందించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో అన్న క్యాంటీన్లలోని అక్షయపాత్ర సిబ్బంది, జిఎంసి అధికారులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, క్యాంటీన్ కి వచ్చే వారిపట్ల అక్షయపాత్ర సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి క్యాంటీన్ లో విజిటర్స్ రిజిస్టర్ తప్పనిసరిగా నిర్వహించాలని, ఆహారం తీసుకునే …

Read More »