విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో నోటీసుల విచారణ పూర్తి అయిందని, తుది జాబితా అక్టోబర్ 9వ తేదీన విడుదల అవుతుందని నగర పాలక సంస్థ అదనపు కమిషనర్, పశ్చిమ నియోజకవర్గ ఈఆర్ఓ ఐ.కిషోర్ తెలిపారు. శుక్రవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు నగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి గుర్తింపు పొందిన రాజకీయ …
Read More »Daily Archives: September 18, 2026
గార్బేజ్ పాయింట్లు కనబడకూడదు…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న 15 రోజుల్లో నగరంలో ఎక్కడా గార్బేజ్ పాయింట్లు కనబడకూడదని, రోడ్ల పై చెత్త వేసే వారిని గుర్తించి వారికి అపరాధ రుసుము విధించాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ శానిటరీ శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో శానిటరీ ఇన్స్పెక్టర్లతో ప్రజారోగ్య విభాగ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో స్వచ్చతాహీ సేవా కార్యక్రమం క్రింద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, నగరంలో …
Read More »గుంటూరు నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరాయే లక్ష్యం… : కమిషనర్ మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరచడమే కాకుండా, విలీన గ్రామాలు, తాగునీటి సదుపాయం లేని ప్రాంతాల్లో నీటి ఎద్దడిని తీర్చేందుకు అమృత్ 2.0, యుఎఫ్ఐడీ పథకాల ద్వారా నీటి పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గుంటూరు నగర పాలక సంస్థ సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసిందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పరిధిలో ప్రజలకు సురక్షితమైన తాగునీటిని …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు
-పామర్రులో నియోజకవర్గస్థాయి ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహణ -ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ డీకే బాలాజి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని, ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. పామర్రు నియోజకవర్గ ప్రజల …
Read More »ఐనంపూడిలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ పరిశీలించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి నిర్మాణ పనులు పరిశీలన ఐనంపూడి(పామర్రు), నేటి పత్రిక ప్రజావార్త : నియోజకవర్గానికి ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా పామర్రు మండలం ఐనంపూడిలో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం పామర్రు నియోజకవర్గ శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజాతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఐనంపూడిలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు మొత్తం 10 ఎకరాల భూమి కేటాయించగా, అందులో 6.62 ఎకరాల్లో అభివృద్ధి …
Read More »ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆకస్మిక తనిఖీ
-వైద్య సేవలు, రికార్డుల నిర్వహణపై క్షుణ్ణంగా పరిశీలన తరకటూరు(గూడూరు), నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి శుక్రవారం గూడూరు మండలం, మల్లవోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తరకటూరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఓపీ రిజిస్టర్, రిఫరల్ రిజిస్టర్, డ్రగ్ రిజిస్టర్, ఎన్‌సీడీ రిజిస్టర్లను …
Read More »సామూహిక ఎలుకల నిర్మూలనకు రైతులు సహకరించాలి
-పామర్రులో పోస్టర్లు, కరపత్రాలు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, శాసనసభ్యుడు వర్ల కుమార్ రాజా పామర్రు, నేటి పత్రిక ప్రజావార్త : పంటలకు నష్టం కలిగించే ఎలుకలను సామూహికంగా నిర్మూలించేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పామర్రు మండలంలోని పామర్రు ఎస్‌కేఆర్‌ఆర్ జెడ్పీ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న ఆరేపల్లి కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్, పామర్రు నియోజకవర్గ …
Read More »విద్యార్థులకు స్వచ్ఛత పాఠశాల పై అవగాహన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాల్లో భాగంగా పటమటలోని కేవీఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) డాక్టర్ డి. చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పిస్తూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026 ప్రకారం నాలుగు రకాల చెత్తబుట్టలను …
Read More »ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం దావు బుచయ్య కాలనీ, మధురా నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ …
Read More »మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-2 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …
Read More »
Prajavartha Online Telugu News