Breaking News

వర్షాభావ పరిస్థితి నేపథ్యంలో రైతులు, కౌలు రైతులను ఆదుకోండి

-సీఎం చంద్రబాబుకు సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పశుపోషకులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సచివాలయంలో శుక్రవారం కలిసి పలు అంశాలపై రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్న జిల్లాల్లో తాము పర్యటించామని తెలిపారు. ఎల్‌నినో కారణంగా తలెత్తిన కరువు పరిస్థితులను సాధారణ ప్రకృతి వైపరీత్యంగా కాకుండా అత్యవసర పరిస్థితిగా పరిగణించాలన్నారు. పంట నష్టపోయిన రైతులు, కౌలు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా పరిహారం అందించాలన్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని కోరారు. సీఎంను కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, ముప్పాళ్ల నాగేశ్వరరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నెం.1గా ఎపి విద్యావ్యవస్థ!

-క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యం…అందుకే విద్యాశాఖ ఎంచుకున్నా -సాంకేతికతకు భారతీయ విలువలు జోడించి ప్రపంచ విజేతలుగా ఎదుగుదాం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *