-ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు
ఏలూరు జిల్లా -పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో పాటు పోలవరం ప్రాజెక్ట్ వద్ద పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులు, సిబ్బందితో కలిసి ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం రాష్ట్రానికి, దేశానికి అత్యంత కీలకమైనదని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు.
గత పాలకుల హయాంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందో లేదో అనే ప్రశ్నార్థక పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న సహకారం, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న నిధులు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర పర్యవేక్షణతో పోలవరం పనుల్లో వేగం పెరిగిందని మంత్రి అన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పోలవరం ప్రాజెక్ట్ వద్ద జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పోలవరం ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రార్థిస్తున్నామని మంత్రి తెలిపారు. ఆయన నాయకత్వంలో భారతదేశం మరింత శక్తివంతమైన, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని సాధించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచనలకు అనుగుణంగా దేశం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News