జిల్లాలో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

-వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశాం..
-1577 పోలింగ్ కేంద్రాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసందానం.
-కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నా
-కలెక్టరు డీఈవో డా. కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,23,149 మంది ఓటర్లు తమ అమూల్య మైన ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కె.మాధవీలత పేర్కొన్నారు.

సోమవారం ఉదయం కలెక్టరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కలెక్టరు పర్యవేక్షించారు. అనంతరం స్థానిక కంబాల పేట చున్నీ లాల్ జాజు రోటరీ మునిసిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఈ సందర్బంగా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా.మాధవీలత మాట్లాడుతూ జిల్లాలోని 1577 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఉదయం 5.30 గంటలకు పోలింగ్ సిబ్బంది మాక్ పోల్ నిర్వహించారన్నారు. ఉదయం 7 గంటల నుంచి రెగ్యులర్ పోలింగ్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. పోలింగ్ ఏజెంట్లను కూడా అన్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నా రన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో నూరు శాతం వెబ్ క్యాస్టింగ్ కొరకు కెమెరాలను పోలింగ్ కేంద్రాలు లోపల బయట కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలను కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ కు అనుసందానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఉదయం 5 గంటల నుంచి కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షణా చేస్తున్నా మన్నారు. జిల్లా ఎస్పీ, ఇతర ఇబ్బంది సమన్వయంతో పోలింగ్ సజావుగా పారదర్శకంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎక్కడా ఎటువంటి సంఘటనలు జరగలేదని సజావుగా పోలింగ్ ప్రక్రియ జరగుతున్నట్లు తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ స్టేషన్ లో త్రాగునీరు, నీడ కొరకు షామియానాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని కలెక్టరు తెలిపారు. ఈసారి ఓటింగు శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *