Breaking News

Latest News

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో మంజూరైన (లెటర్ ఆఫ్ క్రెడిట్) ఎల్ ఓ సీ ను సోమవారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, మాజీ కార్పొరేటర్లు, కూటమినేతలతో కలిసి అందజేశారు. 55 వ డివిజన్ వించిపేటకు చెందిన దేవకుమార్ ( 68) నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో ఎన్డీఏ కార్యాలయంలో ఎల్ వో సి కొరకు …

Read More »

మహిళల ఆర్థిక స్వావలంబన, గ్రామీణ జీవనోపాధుల బలోపేతమే లక్ష్యం

-ప్రతి గ్రామ సంఘం నుంచి 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలి -సెర్ప్ సీఈఓ వాకాటి కరుణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ పేద కుటుంబాల ఆర్థికాభివృద్ధి, మహిళల స్వయం సమృద్ధి, స్థిరమైన జీవనోపాధుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) ముఖ్య కార్యనిర్వాహణ అధికారి వాకాటి కరుణ అధికారులకు సూచించారు. మహిళల సాధికారతకు కేవలం రుణాల మంజూరుతో సరిపెట్టకుండా, వాటి ద్వారా ఆదాయ వనరులు …

Read More »

జలధార పనులను వేగవంతం చేయాలి… : జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జలధార పనులను జూన్ 15 నాటికి ఖచ్చితంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలక్టరేట్ లోని వీసీ హాల్ లో జిల్లాలోని అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా, మండల అధికారులతో జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ దరఖాస్తులు బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్ళకుండా …

Read More »

ఘనంగా pre-convaction (ఫ్రీ కాన్వికేషన్) వేడుకలు

-అవార్డు గ్రహీతలను అభినందించిన మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 29వ, 30వ స్నాతకోత్సవ వేడుకలు విజయవాడలో మంగళవారo జరగనున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో సోమవారం రాత్రి “pre convocation” సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. దీనికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీనియ‌ర్ కార్డియాల‌జిస్ట్‌ డాక్టర్ సి.నరసింహన్, పి. సి. రాత్ ( విశ్వవిద్యాలయ డాక్టర్ ఆఫ్ సైన్స్ స్ ) అవార్డు …

Read More »

అభివృద్ధి పనుల్లో జాప్యం అంగీకరించేది లేదు : ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

-విజయవాడ కార్యాలయంలో నాలుగు మండలాల అధికారులతో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సమీక్ష సమావేశం -నియోజకవర్గ అభివృద్ధి పనులు, పెండింగ్ అంశాలపై చర్చ -అభివృద్ధి పనులను వేగవంతం చేసి గడువులోగా పూర్తి చేయాలని ఆదేశాలు -ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని సూచన -పనుల్లో నిర్లక్ష్యం, జాప్యం సహించబోమని అధికారులకు హెచ్చరిక -ప్రభుత్వ హామీల అమలులో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచన -బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రతి అధికారి …

Read More »

ఇళ్ల గణనను 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి

– నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, కమిషనర్ కె. మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో జనాభా గణన–2026లో భాగంగా నిర్వహిస్తున్న ఇళ్ల గణన (హౌస్ లిస్టింగ్) ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో, మిగిలిన పనులను అత్యంత జాగ్రత్తగా, 100 శాతం ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని నగర ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ కె. మయూర్ అశోక్ సూపర్వైజర్లను ఆదేశించారు. సోమవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఇళ్ల …

Read More »

ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుండి అందే అర్జీలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని గుంటూరు నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ జి.సాంబశివరావు విభాగాదిపతులకు తెలిపారు. సోమవారం నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జిఎంసి కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పిజిఆర్ఎస్ కు అందే ఫిర్యాదుల్లో ఎక్కువగా పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి సరఫరా మరియు …

Read More »

గుంటూరు నగరపాలక సంస్థకు అంతర్జాతీయ పురస్కారం

-UNIDO ‘జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్’ అవార్డు అందుకున్న కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఐక్యరాజ్యసమితికి చెందిన యునిడో (యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) ప్రతిష్టాత్మక “జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్” అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్‌లో జరిగిన ‘సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SC-IAP)’ ప్రాజెక్ట్ వర్క్‌షాప్‌లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ ఈ …

Read More »

ఒకటో తేదీనే పెన్షన్.. పేదలకు కొండంత భరోసా

-గుంటూరు నగర కమిషనర్ మయూర్ అశోక్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నెల ప్రారంభంలోనే ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరడం పేదలు, వృద్ధులు, మరియు వికలాంగులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తుందని గుంటూరు నగర పాలక సంస్థ కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒకటవ తేదీనే పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం ఉదయం శ్రీనివాసరావుతోట 69వ సచివాలయం పరిధిలో అచ్చి నాగేంద్రం అనే వికలాంగురాలి ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

నగరంలో ఈనెల 7న బ్రాహ్మణ సంక్షేమ ఆత్మీయ చర్చా గోష్ఠి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ సామాజికవర్గం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వానికి తగు సూచనలు చేసేందుకు ఈనెల 7వ తేదీన విజయవాడలోని ఐలాపురం హోటల్‌లో రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ వేద విజ్ఞాన పరిషత్ వెల్లడించింది. సోమవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పరిషత్ చైర్మన్ డి.వి. బాలసుబ్రమణ్యం, ప్రముఖ న్యాయవాది చుండూరు సుందర రామశర్మ ఈ వివరాలను వెల్లడించారు. ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్యాంశాలు…నిష్పాక్షిక వేదిక ఈ సమావేశానికి …

Read More »