Breaking News

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై కమిషనర్ మయూర్ అశోక్ సీరియస్

-గురువారం పట్నంబజార్ లోని హోల్సేల్ షాప్ ల్లో నేరుగా తనిఖీ
-ప్రజారోగ్యానికి భంగం కల్గించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు, షాప్ ల సీజ్, అపరాధ రుసుం విధింపు
-సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం, ట్రేడ్ లైసెన్స్ లు లేకుండా షాప్ లు నిర్వహిస్తున్నాపట్టించుకోకపోవడంపై శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ
-హోల్ సేల్ షాప్ లకు క్యారీ బ్యాగ్ లు సరఫరా చేస్తున్న తయారీ సంస్థల వివరాలు తీసుకొని, నిర్దేశిత చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు
-సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలే కాకుండా వినియోగించే వారిపై కూడా అపరాధ రుసుం విధించాలని ఆదేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో నిషేధిత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగంపై నగరకమిషనర్ కె.మయూర్ అశోక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకం, విక్రయాలపై గురువారం నేరుగా పట్నంబజార్‌లోని పలు హోల్సేల్ వ్యాపార సముదాయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, అక్కడ భారీగా నిల్వ ఉంచిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి, సంబంధిత దుకాణాలను తక్షణమే సీజ్ చేయడంతోపాటు, అపరాధ రుసుం విధించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్, గత 45 రోజులుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నిరంతరం అవగాహన కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నా పట్టించుకోకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, సంబంధిత శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు శానిటేషన్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సిఎంఓహెచ్ ను ఆదేశించారు. నగరంలోని హోల్సేల్ షాపులకు నిషేధిత క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ ఉత్పత్తులను సరఫరా చేస్తున్న తయారీ యూనిట్లు వివరాలను సేకరించి, నిర్దేశిత పర్యావరణ పరిరక్షణ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.
అలాగే ప్లాస్టిక్ విక్రయించే వారిపైనే కాకుండా, నిషేధిత ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వినియోగించే ప్రజలు, వ్యాపారులపై కూడా అపరాధ రుసుం విధించాలన్నారు. నవ గుంటూరులో భాగంగా ప్లాస్టిక్ రహిత నగరంగా తద్వారా పర్యావరణహిత నగరంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, గుడ్డ సంచులను మాత్రమే ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నగరంలో పలు వ్యాపార వాణిజ్య సంస్థలు ట్రేడ్ లైసెన్స్ లేకుండా, ఆస్తి పన్ను చెల్లించకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, రానున్న వారం రోజుల వ్యవధిలో వార్డ్ సచివాలయాల వారీగా నిర్దేశిత చట్టం మేరకు ప్రతి కమర్షియల్ సంస్థ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, ఆస్తి పన్ను కూడా చెల్లించాలన్నారు. తాము చేసే ఆకస్మిక తనిఖీల్లో ట్రేడ్ లైసెన్స్ లేకున్నా, పన్ను చెల్లించకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ బాబ్, ఎస్ఎస్ లు అయూబ్ ఖాన్, సోమశేఖర్, వెంకటప్పయ్య, రాజేష్, సాంబయ్య, ఐజాక్, ప్రజారోగ్య అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *