Breaking News

సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు

-ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026)లో క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక అవకాశం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మశా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబర్ 5, 6 తేదీల్లో జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా సీఈఓ వివేక్ యాదవ్ కు వివరించారు.

తొలుత ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల విభాగ కార్యాలయం నుండి సీఈఓ వివేక్ యాదవ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ వివేక్ యాదవ్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR–2026) ప్రక్రియలో భాగంగా రాజకీయ పక్షాల అభ్యర్థన మేరకు 01.09.2026న సవరించిన షెడ్యూల్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం క్లెయిమ్స్ మరియు అభ్యంతరాల దాఖలుకు గడువును 30.08.2026 నుంచి 10.09.2026 వరకు పొడిగించినట్లు తెలిపారు. ఇప్పటివరకు దాఖలైన క్లెయిమ్స్, అభ్యంతరాలపై గతంలో నిర్ణయించిన తుది తేదీ 28.09.2026 కాగా, సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆ గడువును 05.10.2026 వరకు పొడిగించారు. అదేవిధంగా తుది ఓటర్ల జాబితా ప్రచురణ తేదీని 03.10.2026 నుంచి 09.10.2026కు మార్చడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 05.09.2026, 06.09.2026 తేదీలలో (శనివారం, ఆదివారం) ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలోని 1,936 పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు (BLOలు) ఉదయం 10.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రాజకీయ పార్టీలు నియమించిన బూత్ స్థాయి ఏజెంట్లతో కలిసి అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమాల్లో బూత్ స్థాయి అధికారులు ఫారం–6, ఫారం–6A, ఫారం–7, ఫారం–8తో పాటు ముసాయిదా ఓటర్ల జాబితా, ASDD జాబితా, అలాగే SIR–2026 ప్రక్రియలో నోటీసులు జారీ చేసిన వారి జాబితాలతో సిద్ధంగా ఉంచుతామన్నారు. ప్రజల నుంచి క్లెయిమ్స్, అభ్యంతరాలు, ఇతర దరఖాస్తులను స్వీకరించడంతో పాటు, వారి సందేహాలను నివృత్తి చేసి తగిన మార్గనిర్దేశనం చేస్తామన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేర్లు లేని అర్హత కలిగిన వయోజనులు, అలాగే 18–19 సంవత్సరాల యువత ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీశ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వీకరించిన ప్రతి దరఖాస్తును బూత్ స్థాయి అధికారులు తక్షణమే పరిశీలించి, అవసరమైన చోట స్థానిక విచారణ నిర్వహించి, తదుపరి చర్యల కోసం సంబంధిత *నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి (ERO)*కు సమర్పిస్తారని కలెక్టర్ తెలిపారు. ప్రత్యేక ప్రచార కార్యక్రమాల నిర్వహణను జిల్లా రోల్ అబ్జర్వర్, జిల్లా కలెక్టర్, EROలు, AEROలు ప్రత్యక్షంగా పరిశీలిస్తారని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఈ సందర్భంగా తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *