Breaking News

శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్‌లో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాల విలువలను తెలియజేసేలా ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు తెలిపారు. గురువారం చిట్టినగర్‌లోని శ్రీ గౌతమ్ విద్యాసంస్థల స్మార్ట్ క్యాంపస్‌లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలతో సందడి చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో క్యాంపస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. కృష్ణాష్టమి వేడుకలకు శ్రీ గౌతమ్ విద్యాసంస్థల అధినేత ఎన్. సూర్యారావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారులతో కలిసి వేడుకల్లో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉట్టి కార్యక్రమంలో పాల్గొని ఉట్టి కొట్టారు.
ఈ సందర్భంగా ఎన్. సూర్యారావు మాట్లాడుతూ.. తమ విద్యాసంస్థల్లో అన్ని పండుగలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రతి పండుగ యొక్క విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. చిన్నతనం నుంచే విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, ధర్మ మార్గంలో నడిచే గుణాలను పెంపొందించేలా బోధిస్తున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడమే లక్ష్యంగా ప్రతి పండుగను వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా అన్ని పండుగలను విద్యార్థుల భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహిస్తామని ఎన్. సూర్యారావు తెలిపారు. విద్యాసంస్థల్లో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు అందిస్తున్న సహకారం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీ గౌతమ్ విద్యాసంస్థల ప్రిన్సిపల్ పారెళ్ళ తులసి, స్మార్ట్ క్యాంపస్ ఇంచార్జ్ సునీత, హైస్కూల్ ఇంచార్జ్ బి మోహన్,, మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *