Breaking News

జాషువా ఆశయాల బాటలో వైఎస్ జగన్ పాలన : మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-​ఘనంగా నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా వర్ధంతి
​-సింగ్ నగర్ జనహిత సదనంలో చిత్రపటానికి నివాళులు
-​అవమానాలనే ఆభరణాలుగా మలుచుకున్న మహనీయుడని కొనియాడటం
-మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ఎదురైన ఛీత్కారాలనే సత్కారాలుగా, అవమానాలనే ఆభరణాలుగా మలుచుకుంటూ, మానవత్వమే పరమావధిగా జీవించిన మహోన్నత వ్యక్తి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ​శుక్రవారం నగరంలోని సింగ్ నగర్ జనహిత సదనంలో గుర్రం జాషువా వర్ధంతి కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి భావపూర్వకంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ, గుర్రం జాషువా తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో చిన్నతనం నుంచే సమాజంలో తీవ్రమైన వివక్షను, అంటరానితనాన్ని ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. ఆనాటి సామాజిక రుగ్మతలను, అసమానతలను తన కలం బలం ద్వారా ప్రశ్నించారని కొనియాడారు. గబ్బిలం, ఫిరదౌసి, స్వప్నకథ వంటి శ్రేష్ఠమైన కావ్యాల ద్వారా సమాజానికి గొప్ప చైతన్యాన్ని అందించారన్నారు. గుర్రం జాషువా సాహిత్యానికి చేసిన అసమాన సేవలకుగాను సమాజం ఆయనను నవయుగ కవి చక్రవర్తి, కవి కోకిల, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ వంటి అనేక బిరుదులతో సత్కరించిందని తెలిపారు. బిరుదులకే వన్నె తెచ్చిన గొప్ప సాహిత్యమూర్తి ఆయన అని కొనియాడారు. ఆయన రాసిన ప్రతీ పద్యం సామాజిక సమరసతను, సమానత్వాన్ని నొక్కి చెప్పిందని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయన అడుగుజాడల్లో నడిచిందని గుర్తు చేశారు. ​గుర్రం జాషువా కలలు కనిన సమసమాజ స్థాపన దిశగా వైఎస్సార్‌సీపీ అడుగులు వేసిందని మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద వర్గాలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలు అన్నింటిలోనూ నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. నవరత్నాల సంక్షేమ పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికీ చేయూతనందించి, వివక్ష లేని పాలనతో గుర్రం జాషువా కన్న కలలను వైఎస్ జగన్ నిజం చేశారని కొనియాడారు. మహనీయుల త్యాగాలను, వారు సమాజానికి అందించిన సేవలను స్మరించుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని మల్లాది విష్ణు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ శైలజ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కుక్కల అనిత రమేష్, యర్రగొర్ల శ్రీరాములు, యర్రంశెట్టి అంజిబాబు, గుడిసె శ్యామ్, వంశీ, ప్రేమ్, నిరీక్షణ్, మాలిక్, నాగభూషణం, యలమంద, రామిరెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గుర్రం జాషువాకు నివాళులర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వ్యవసాయాభివృద్ధికి శాస్త్రీయ పరిశోధనలు, సహజ వ్యవసాయమే భవిష్యత్‌కు మార్గం

-రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ బాపట్ల, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *