Breaking News

All News

ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున దాదాపు రూ. 2.23 కోట్ల విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి శ్రీశైలం నియోజకవర్గం తరపున రూ. 2,22,70,749/- అక్షరాలా రెండు కోట్ల ఇరవై రెండు లక్షల డైబ్బైవేల ఏడు వందల నలభై తొమ్మిది రూపాయులు విరాళం అందజేయడం జరిగింది. నేడు వెలగపూడిలోని సచివాలయంలో రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడులు శాఖ మంత్రి బీ.సి. జనార్దన్ రెడ్డి, న్యాయ & మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు …

Read More »

మైనార్టీల సంక్షేమం ప్రభుత్వ ధ్యేయం

-మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక -రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ -వరద ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న మసీదులకు మైకు సెట్లు, కార్పెట్లు పంపిణీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఇదే లక్ష్యంతో కార్యాచరణ అమలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. గురువారం విజయవాడలో వరద విపత్తుతో ముంపుకు గురైన …

Read More »

హోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని

-కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని -కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి -నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి -ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని హోంమంత్రి ఛాంబర్ లో కుటుంబ సభ్యులతో సహా …

Read More »

వంద రోజుల పాలనపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

-సమీక్షలో పాల్గొన్న స్పెషల్ సీఎస్, ముగ్గురు సీఎండీలు -వంద రోజుల్లో 12 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లు -పారిశ్రామిక, డొమెస్టిక్ అవసరాలకు నిరంతర విద్యుత్ -త్వరలోనే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వంద రోజుల పాలనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు వాటి అమలుపై ఆరా తీశారు. ప్రత్యేకించి కొత్త వ్యవసాయ కనెక్షన్లు …

Read More »

గ్రీవెన్స్ కార్యక్రమంలో మానవత్వం చాటుకున్న మంత్రి గొట్టిపాటి

-చిన్నారి ట్రీట్ మెంట్ కు ఆర్థిక సాయం -అధికారుల అలసత్వంపై ఫిర్యాదులు… చర్యలకు వినతులు -గ్రీవెన్స్ కు పోటెత్తిన అర్జీదారులు… వినతులు స్వీకరించి పరిష్కారం చూపిన నేతలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు సంవత్సరాలు ఉన్న తన పాపకు చిన్నమెదడు ఎదుగుదల లేదని.. కూర్చోవడం, నడవడం, మాట్లాడటం లేదని.. ట్రీట్ మెంట్ కు హైదరాబాద్ తీసుకెళ్లమని చెబుతున్నారని.. ఇప్పటికే పాప ట్రీట్ మెంట్ కోసం లక్షల రూపాయలు ఖర్చుచేశామని ఇక తమ వద్ద డబ్బులు లేవని .. తమను ఆదుకొని పాప …

Read More »

ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సేకరించాలి… : జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటికి తిరిగి ఎలక్ట్రానిక్ వ్యర్ధాలను సేకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛతాహి సేవ కార్యక్రమం అమలులో భాగంగా గృహాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ షాపులు, ఎలక్ట్రికల్ వస్తువుల అమ్మకపు …

Read More »

ఘనంగా మహాకవి, పద్మ భూషణ్ డా. బోయి భీమన్న 113వ జయంతి ఉత్సవం

-రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కన్నులపండుగగా వేడుకలు -అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు జాతి గొప్పదనాన్ని, తెలుగు సాహితీ సౌరభాన్ని ప్రజలందరికీ అందించిన మహాకవి, పద్మభూషణ్ డాక్టర్ బోయి భీమన్న అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో మహాకవి, పద్మ …

Read More »

బ్యాంకింగ్ సేవ‌ల‌కు ప్ర‌త్యేక ఫెసిలిటేషన్ సెంటర్

– విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటు – ఈ నెల 20వ తేదీ నుంచి వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి – ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో నష్టపోయిన ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌లు అందించేందుకు ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బ్యాకింగ్ ఫెసిలిటేష‌న్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఈ నెల 20వ తేదీ శుక్ర‌వారం నుంచి ఈ కేంద్రం ద్వారా సేవ‌లు పొందొచ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ …

Read More »

యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-పరీక్షకు హాజరు కానున్న 136 మంది అభ్యర్థులు… -డిఆర్వో వి. శ్రీనివాసరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 20వ తేది శుక్రవారం నుండి 22వ తేదీ వరకు తిరిగి 28, 29 తేదీలలో ఐదు రోజుల పాటు నిర్వహించే యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లను సరిచూసుకోవాలని డిఆర్వో వి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. యుపిఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలకు చేసిన ఏర్పాట్లపై గురువారం డిఆర్వో వి. శ్రీనివాసరావు నగరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో …

Read More »

‘నిగమ’ సేవలు భేష్

-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వరద బాధితులకు ఆరు వస్తువులతో కూడిన కిట్లను అందజేసిన నిగమ ఫౌండేషన్ సేవలను రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్ సవిత కొనియాడారు. నగరంలోని భవానీ ఘాట్ స్వాతి సెంటర్ లో వరద బాధితులకు మంత్రి కిట్లను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు పది రోజుల పాటు రేయింబవళ్ళు కష్టపడి విజయవాడ వరద బాధితులను …

Read More »