-ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ జాబితానే అత్యంత కీలకం -అర్హులకు ఓటు హక్కు కల్పించాలి.. నకిలీ ఓటు ఉండడానికి వీల్లేదు -రెండేళ్లలో సాధించిన ప్రగతి, చేసిన మంచి, అమలు చేసిన సంక్షేమం ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి -మచిలీపట్నంలో SIR అవగాహన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీకి ఎన్నికలు అత్యంత కీలకం, అందులో ఓటర్ జాబితా మరింత కీలకమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు …
Read More »All News
ల్యాండ్ పూలింగ్ కింద మూడెకరాల భూమిని అందజేసిన ఉండవల్లి రైతులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి అనుమోలు తిరుపతి రాయుడు కుటుంబం ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా సోమవారం అందజేసింది. ఉండవల్లి గ్రామ పరిధిలో తమ అధీనంలో ఉన్న మూడెకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఆ కుటుంబం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలుపుతూ సంబంధిత పత్రాలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఏ.జి. చిన్నికృష్ణ కి అందజేసింది. ఆ కుటుంబం నుంచి అనుమోలు తిరుపతి రాయుడు 55 సెంట్లు, అనుమోలు బేబీ జానకి …
Read More »ఏపీ సిఆర్డిఏ కార్యాలయంలో “గ్రీవెన్స్ డే” నిర్వహణ..
-అర్జీలు స్వీకరించిన కమిషనర్, అడిషనల్ కమిషనర్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలో రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయంలో సోమవారం “గ్రీవెన్స్ డే” నిర్వహించారు. రాజధాని రైతులు, గ్రామస్తులు తమ సమస్యల పరిష్కారం నిమిత్తం అర్జీలను కమిషనర్ వి.విజయరామరాజు IAS, అడిషనల్ కమిషనర్లు ఏ.భార్గవతేజ IAS, కొల్లాబత్తుల కార్తీక్ IAS కు అందజేశారు. అర్జీదారులు అందజేసిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు తెలియజేశారు. అలాగే కొన్ని సమస్యల పరిష్కారం ప్రభుత్వ నిర్ణయానుసారం ఉంటుందన్నారు. …
Read More »ధార్మిక పోస్టుల భర్తీకి పరీక్ష
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ముఖ్య దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేదపారాయణదారులు, అర్చకులు, పరిచారకులు, భజంత్రీలు, వంట స్వాములు తదితర ధార్మిక పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించి, పరిశీలన అనంతరం హాల్ టిక్కెట్లు జారీ చేసి మొదటగా వేదపారాయణదారులుకు పరీక్ష నిర్వహిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్రమోహన్ అన్నారు. వేదపారాయణదారుల పోస్ట్ లకు సంబందించిన మౌఖిక పరీక్షలు ఈరోజు నుండి ప్రారంభం అవుతున్న సందర్బంగా …
Read More »ఈ నెల 10న గౌరవ రాజీవ్ రంజన్‌మిశ్రా పర్యటన
– ఈ సందర్శనను సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించి అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఈ నెల 10న ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటించనున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కృష్ణా జిల్లా, మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, బీసీ …
Read More »షా బుఖారి దర్గాను సందర్శించిన సుప్రీం కోర్టు ప్యానల్ కౌన్సిల్ సభ్యులు చిరుమామిళ్ల క్రాంతి కుమార్
కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ హజరత్ సయ్యద్ షా బుఖారి బాబా వారి దర్గాను సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించే ప్యానల్ కౌన్సిల్ సభ్యులు చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ఈరోజు షా బుఖారి బాబా సందర్శించారు. దర్గాకు విచ్చేసిన ఆయనకు షా బుఖారి లంగర్ ఖానా నిర్వాహకులు మొహమ్మద్ అల్తాఫ్ బాబా ఘనస్వాగతం పలికారు. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం చిరుమామిళ్ల క్రాంతి కుమార్ ని ఘనంగా సన్మానించారు. అనంతరం …
Read More »ఈ నెల 10న మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు..
– ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ డీసీవో ఎ.మురళీకృష్ణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 10న జి.కొండూరు మండలం కుంటముక్కలలో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్‌ఈఐఎస్ జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) ఎ.మురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలికలకు సంబంధించి మోటూరు, బల్లిపర్రు పాఠశాలల్లో, బాలురుకు సంబంధించి రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణరావుపాలెం పాఠశాలల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. సీట్లు పరిమితంగా ఉన్నాయని.. అయిదో తరగతి నుంచి 9వ …
Read More »ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే ఉద్యమ బాట పడతాం…
-ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నిర్ణయం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ)లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) డిమాండ్ చేసింది. ఈ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా దశలవారీ ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. విజయవాడలోని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాల సంయుక్త సమావేశంలో ఏపీఎస్ …
Read More »నారా లోకేష్ విజన్‌తో ఏపీకి పారిశ్రామిక పునర్వైభవం!- ఎంపీ చిన్ని
-“లోకేష్ చొరవతో ప్రపంచ దిగ్గజాల చూపు ఆంధ్రప్రదేశ్ వైపు!” -“రాయల్ ఎన్‌ఫీల్డ్ రాకకు కారణం పెట్టుబడిదారులకు కల్పించిన విశ్వాస వాతావరణం!” -“యువతకు ఉద్యోగాలు… రాష్ట్రానికి పెట్టుబడులు… లోకేష్ నాయకత్వంలో ఏపీకి కొత్త దిశ!” -విజయవాడ భవానిపురం లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ను సందర్శించిన ఎంపీ చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో గల రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్‌ను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) సందర్శించారు. ఈ సందర్భంగా షోరూమ్ ఎండీ తేజ ఎంపీకి ఘన …
Read More »కార్యకర్తల కష్టమే పార్టీకి బలం!…వియాజయనికి మూలస్థంభం కార్యకర్తల కష్టం
-“కార్యకర్తల అభిప్రాయాలే పార్టీకి దిశానిర్దేశం… రాష్ట్ర అభివృద్ధే అంతిమ లక్ష్యం” -“వీరులపాడు టీడీపీ శ్రేణులతో ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ మమేకం” -“ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ… పార్టీ బలోపేతమే ధ్యేయం” విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా ప్రతినిధిగా రెండేళ్ల సేవా ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మరోసారి పార్టీ కేడర్‌తో తన అనుబంధాన్ని చాటుకున్నారు. అధికార పదవిలో ఉన్నప్పటికీ కార్యకర్తల మధ్యే ఉంటూ వారి అభిప్రాయాలకు విలువనిచ్చే నాయకుడిగా తన ప్రత్యేకతను నిరూపించుకుంటూ, నందిగామ …
Read More »
Prajavartha Online Telugu News