పార్వతీపురం, నేటి పత్రిక ప్రజావార్త : స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యా రాణి శనివారం శ్రీకారం చుట్టారు. ప్రతి మూడవ శనివారం “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు శనివారం సాలూరు మున్సిపాలిటీలో మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చేత చీపురు పట్టారు. రహదారులను శుభ్రం చేశారు. …
Read More »All News
పారిశుద్ధ్య నిర్వహణలో ప్రభుత్వం ఘోర వైఫల్యం
-వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పారిశుద్ధ్య నిర్వహణలో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఇంటింటికి బుట్టలను ఇచ్చి చెత్తను సేకరించాలన్నది లక్ష్యమని.. కానీ క్లాప్ ఆటోలు రాకపోవడంతో ట్రాలీలతో చెత్త సేకరణ సరిగా సాగడం లేదన్నారు. తడిచెత్త, పొడిచెత్తను వేర్వేరుగా సేకరించడం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. చెత్త సేకరణ సజావుగా సాగుతున్న ఒక్క ప్రాంతాన్ని అయినా నగరంలో చూపగలరా..? అని సూటిగా …
Read More »నగరంలో ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో నూతనంగా ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం ప్రారంభ కార్యక్రమంలో సినీనటి మీనాక్షి చౌదరి విచ్చేసి సందడి చేశారు. శనివారం బందరురోడ్డులో ఎమ్మడి సిల్వర్ జ్యువెలరీ షోరూం నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ షోరూంలో ఆకట్టుకునే డిజైన్లతో ఉన్న వెండి ఆభరణాలను చూసి ముగ్ధురాలైనట్లు తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ఆభరణాలు ఇప్పుడు విజయవాడలో అందుబాటులోకి రావడం సంతోషకరమన్నారు. బ్రైడల్ జ్యువెలరీ, అధునాతన, సాంప్రదాయ డిజైన్లకు ప్రత్యేకమైన చెక్కిన డిజైనర్‌గా పేరుగాంచినది …
Read More »జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై పర్యవేక్షణ కమిటీ సమావేశం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పధకాలు అమలు జరుగుతున్న తీరుపై జిల్లా అభివృద్ది సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ ( దిశా) సమావేశాన్ని శనివారం కలక్టరేట్ లోని ఎస్.ఆర్.శంకరన్ సమావేశ మందిరంలో కేంద్ర గ్రామీణాభివృద్ది మరియు కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెడ్పీ ఛైర్ పర్సన్ కత్తెర హెని క్రిస్టినా, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ , శాసన మండలి సభ్యులు చంద్రగిరి ఏసురత్నం, గుంటూరు తూర్పు …
Read More »ప్రభుత్వ ఆదేశాల మేరకు ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ “
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ ఆదేశాల మేరకు ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ ” కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ నందు జిల్లా సంయుక్త కలెక్టర్ ఏ. భార్గవ తేజ , డి ఆర్ ఓ షేక్. ఖజావలి తో కలసి కలక్టరేట్ ప్రాంగణంలో చెత్త మరియు వ్యర్ధాలను తొలగించి మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధికారులచే వారి వారి కార్యాలయాలను శుభ్రపరచుకుంటామని ” స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్చ దివాస్ ” ప్రతిజ్ఞ …
Read More »స్వచ్ఛత శుభ్రత ప్రజల జీవన విధానం కావాలి
-పారిశుద్ధ్య సిబ్బందిది మాత్రమే చెత్త నిర్వహణ బాధ్యత కాదు… ప్రజల్లోనూ చైతన్యం రావాలి -ప్రతి ఇంటి నుంచీ చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలి -స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలి -ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలి -వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం -చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రం పరిశీలన -స్వచ్ఛ కార్మికులకు సత్కారం -చెత్త రవాణా వాహనం ప్రారంభించి, స్వయంగా నడిపిన పవన్ …
Read More »పశు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోండి…
-జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశువుల ఆరోగ్య పరిరక్షణతో పాటు ఉత్పాదకతను పెంచి వ్యాధులను నియంత్రించడానికి పశు ఆరోగ్య శిబిరాల ద్వారా పశుసంవర్ధన సేవలను అందుబాటులో తీసుకువచ్చేందుకు నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను పశు పోషకులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ అన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి 31వ తేది వరకు జిల్లాలో నిర్వహించనున్న పశు ఆరోగ్య శిబిరాలకు సంబంధించిన వాల్ పోస్టర్ కరపత్రాలను జిల్లా కలెక్టర్ డా.జి. …
Read More »గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ (జివిపి)లను తక్షణమే తొలగించండి..
-గార్భేజ్ వనరబుల్ పాయింట్స్ వద్ద సిసి కెమెరాల నిఘ ఉంచండి.. -అనుమతి లేని ప్రాంతాలలో వ్యర్థాలను వేస్తే కఠిన చర్యలు. -జిల్లా కలెక్టర్ డా.జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాలు రోడ్ల వెంట వ్యర్థా పద్ధార్థాలను వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న గార్భేజ్ వనరబుల్ పాయింట్స్‌ను తక్షణమే తొలగించాలని ఆయా ప్రాంతాలలో సిసి కెమెరాలతో పాటు సిబ్బందిని నిఘా ఉంచి వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి జరిమానాలను విధించేలా చర్యలు తీసుకోవాలని …
Read More »ప్లాస్టిక్ రహిత జీవన విధానానికి అలవాటు పడాలి…
-ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలాధారం.. -స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలి.. -ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్లాస్టిక్ రహిత జీవన విధానాన్ని అలవాటు చేసుకుని ప్లాస్టక్ ముప్పు నుండి జిల్లాకు విముక్తి కల్పిద్దామని, ప్రజారోగ్యానికి పరిశుభ్రతే మూలకారణం అని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ్ దివస్ కార్యక్రమం ద్వారా పచ్చదనం` పరిశుభ్రతలో అగ్రగామిగా నిలుపుదామని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. స్వచ్చఆంధ్ర ` స్వచ్ఛ్ దివస్ కార్యక్రమంలో …
Read More »స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీ అమలు చేయాలి
– ఏపీ హోటల్స్ అసోసియేషన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి కోరారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి, తాజ్ గేట్ వే అధినేత రాజయ్య, మురళీ ఫార్సూనర్ అధినేత ముత్తవరపు మురళీ లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం రాత్రి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిచారు. ఈ సందర్భంగా …
Read More »