Breaking News

ఎంఎస్ఎంఈలు, స్టార్టప్‌లకు కూటమి ప్రభుత్వం పూర్తి సహకారం: మంత్రి కందుల దుర్గేష్

-విశాఖపట్నంలో ఎంఎస్ఎంఈల బిజినెస్ ఎక్స్ పో -2026 ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-విశాఖలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఘనంగా ప్రారంభమైన ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిజినెస్ ఎక్స్‌పో.. 13 వరకు నిర్వహణ
-పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, MSMEలు, స్టార్టప్‌లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారం.. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణించే వారికి సదవకాశం :మంత్రి దుర్గేష్
-ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖపట్నంలోని గాదిరాజు ప్యాలెస్‌లో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ నిర్వహిస్తోన్న “ఎంఎస్ఎంఈ బిజినెస్ ఎక్స్‌పో-2026” ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ప్రతినిధులతో కలిసి సెప్టెంబర్ 11 నుండి 13 వరకు జరిగే ఎక్స్‌పోను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ పరిశ్రమల ప్రొడక్ట్ స్టాళ్లను మంత్రి దుర్గేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్వయంగా పరిశీలించారు. ఎంఎస్ఎంఈలు, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటకం, స్టార్టప్ తదితర ఒక్కో స్టాల్ నిర్వాహకులతో ప్రత్యేకంగా మాట్లాడి, ఉత్పత్తులు, వ్యాపార వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్స్‌పోలో మొత్తం 187 స్టాళ్లను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రతినిధులను ప్రశంసించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో MSMEలు, స్టార్టప్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధిని పెంచడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా “ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024-29)” విధానాన్ని అమలు చేస్తోంది.ఈ పాలసీ ద్వారా 2030 నాటికి “ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అనే వినూత్నమైన దృక్పథాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా ఐదేళ్లలో రూ. 50,000ల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. 1.75 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేస్తోంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సరైన గైడెన్స్, కన్సల్టెన్సీ సేవలు అందిస్తూ, వారి వ్యాపారాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు MSMEలకు ప్రత్యేక వింగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న వైజాగ్ నగరంలో ఇలాంటి బిజినెస్ ఎక్స్‌పోలు ఏర్పాటు చేయడం ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. అంతేగాక ఒక ప్రైవేట్ సంస్థగా ఉన్న ఏపీ చాంబర్ షాప్ కామర్స్ ప్రభుత్వ ఆర్థికపర, విధానపరమైన ఆలోచనను తద్వారా సహకారం అందించేందుకు ఒక కామన్ ప్లాట్ఫారం ఈ బిజినెస్ ఎక్స్ పో ద్వారా తీసుకువచ్చింది. ఈ ఎక్స్ పోలను సద్వినియోగం చేసుకొని పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను విస్తరిస్తూ, తమ ఉత్పత్తులకు తమ కంపెనీని ప్రమోట్ చేసుకొని కొత్త కొత్త ఆలోచనలతో మరింత ముందుకు వెళ్లి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలి.” అని పేర్కొన్నారు.

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ… “పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమర్థవంతమైన నాయకత్వంలో రాష్ట్రంలో పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ విశాఖపట్నం పర్యాటకంగా, పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. త్వరలోనే వైజాగ్ నగరంలో 16 ఫైవ్ స్టార్ హోటళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. పర్యాటక అభివృద్ధికి ఈ ఎక్స్‌పోలు ఎంతో దోహదపడతాయి.” అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల వ్యాపారవేత్తలు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *