Breaking News

అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు: కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటుకు హోంమంత్రి అనిత ఆదేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వద్ద అల్పపీడనం కేంద్రీకృతమవ్వడంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. రానున్న మూడు రోజుల పాటు ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత స్పష్టం చేశారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లను తక్షణమే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అల్పపీడన పరిస్థితిపై ఎప్పటి ఎప్పటికప్పుడు సందేశాలు పంపాలని అధికారులకు సూచించారు. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 అందుబాటులో ఉంచామని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి విజ్ఞప్తి చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *