Breaking News

Daily Archives: June 9, 2024

పార్ల‌మెంట్ భ‌వ‌న్ లో సీఎం చంద్ర‌బాబు ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధానిగా న‌రేంద్ర మోదీ రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో ఆదివారం జ‌రిగిన ప్ర‌మాణ స్వీకారోత్స‌వం కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) పాల్గొన్నారు. అలాగే మోదీ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం అనంత‌రం పార్లమెంట్ భ‌వ‌న్ లో కేంద్ర‌మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు, గుంటూరు ఎంపి పెమ్మసాని చంద్ర‌శేఖ‌ర్, అమ‌లాపురం ఎంపి జి.ఎమ్.హ‌రీష్ బాల‌యోగి, వైజాగ్ ఎంపి శ్రీ భ‌ర‌త్ తో క‌లిసి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యులు కేశినేని శివనాథ్ మ‌ర్యాద పూర్వ‌కంగా టిడిపి అధినేత …

Read More »

దేశ ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి 7 దేశాల అధినేతలు, CJI జస్టిస్ చంద్రచూడ్, చంద్రబాబు, పవన్, పలువురు సీఎంలు, ఖర్గే, ముకేశ్ అంబానీ, అదానీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా 8 వేల మంది ప్రముఖులు హాజరయ్యారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడోసారి.

Read More »

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధం..

-11 ఎకరాల్లో ఏర్పాట్లు పూర్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి కేసరపల్లి సిద్ధమవుతోంది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాట్లపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. 11 ఎకరాల స్థలంలో ఏర్పాట్లు జెట్‌ స్పీడ్‌తో జరుగుతున్నాయి. ఐదుగురు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో ఘనంగా ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నారు. సభా వేదిక, సీటింగ్, భద్రత, పార్కింగ్ పై అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రముఖులతోపాటుగా …

Read More »

రామోజీ మరణం పత్రిక రంగానికి తీరనిలోటు…పాత్రికేయులకు దారి దీపం రామోజీరావు

-వైఫల్యాలను “విజయాలు”గా మార్చుకున్న గొప్ప ధీరుడు -భవిష్యత్ తరాలకు దార్శనికుడు -ఏపిజేఎసి అమరావతి నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మరణం పత్రిక రంగానికి తీరని లోటని ఏపిజేఏసి అమరవతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, స్టేట్ సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళికృష్టనాయుడు ఆదివారం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. రామోజీరావు అతి సామాన్య కుటుంబంలో పుట్టి తన నిరంతర శ్రమ, కృషి, పట్టుదలతో, అనితర …

Read More »

రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించిన సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతంలో ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సిఆర్డిఏ అధికారులతో కలిసి సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న నేపధ్యంలో సిఎస్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.గత చంద్రబాబు ప్రభుత్వం అమరావతి రాజధానిని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టగా గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఐదేళ్ళుగా రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచి పోయాయి.ప్రస్తుతం మరలా అపనులన్నీ శర వేగంగా పున:ప్రారంభం అయ్యేందుకు అవకాశం …

Read More »

దుర్గమ్మ అమ్మవారిని విశేషముగా దర్శించుకున్న భక్తులు 

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పై వెలిసిన దుర్గమ్మ అమ్మవారి దర్శనార్ధం ఆదివారం విశేషముగా విచ్చేసిన భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లును ఎప్పటికప్పుడు  ఆలయ ఈవో కె ఎస్ రామరావు పరిశీలించారు.  రద్దీ రోజురోజుకు పెరుగుచున్నందున ఆలయ కార్యాలయం సిబ్బందికి కూడా రద్దీ ని అనుసరించి, శుక్ర, శని, ఆదివారములు మరియు ప్రత్యేక రోజులలో రద్దీ క్రమబద్దీకరణకు గాను ప్రత్యేక విధులు కేటాయించారు. వేసవి సందర్బంగా దేవస్థానం నందు ప్రతిరోజూ మధ్యాహ్నం మజ్జిగ పంపిణీ చేసారు. …

Read More »

అక్షర యోధుడు రామోజీ కి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు అశ్రునివాళి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని, పత్రికా రంగంలో చెరగని ముద్ర వేసిన అక్షర యోధుడు రామోజీరావు మరణం తీరని లోటని పలువురు జర్నలిస్టు మిత్రులు పేర్కొన్నారు. ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు ఎస్ ఎన్ మీరా అధ్యక్షతన గుంటూరు బ్రాడీపేట లోని ఎస్ హెచ్ ఓ కార్యాలయంలో జర్నలిస్టు మిత్రులు రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. …

Read More »