-కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు సేవలందించడంలో ప్రణాళిక ప్రకారం పనిచేయాలి. -ప్రత్యేక కంట్రోల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు -జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 12న గన్నవరం మండలం, కేసరపల్లి గ్రామంలో ఐటీ పార్కు సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ నారా చంద్రబాబునాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి హాజరయ్యే వీవీఐపీ, వీఐపీ అతిధులకు మార్గదర్శకాలకు అనుగుణంగా సమన్వయంతో పనిచేసి పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో …
Read More »Daily Archives: June 10, 2024
కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన తెలుగు రాష్ట్రాల మంత్రులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన మంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శాఖలను కేటాయించారు. 1) కింజారపు రామ్మోహన్ నాయుడు – పౌర విమానయాన శాఖ 2) భూపతి రాజు శ్రీనివాస్ వర్మ – స్టీల్, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి 3) పెమ్మసాని చంద్రశేఖర్ – గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ సహాయ మంత్రి 4) జి కిషన్ రెడ్డి – బొగ్గు గనుల శాఖమంత్రి 5) బండి సంజయ్ కుమార్ – హోం శాఖ …
Read More »ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార నేపధ్యంలో ప్రముఖుల పర్యటనల సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు
-పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్. విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా, గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, ఐటీ పార్క్ వద్ద ది: 12.06.2024వ తేదిన నారా చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపధ్యంలో నగరంలో ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, వి.వి.ఐ.పి.లు,అధికారుల పర్యటనల సందర్బంగాఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటూ అన్ని శాఖల సమన్వయంతో చేయు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు …
Read More »రాజకీయాల నుంచి తప్పుకున్న కేశినేని నాని
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికలకు ముందు వైకాపాలో చేరి ఓటమిపాలైన విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ ప్రయాణాన్ని ముగించినట్లు ఆయన ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. జాగ్రత్తగా ఆలోచించాకే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండుసార్లు ఎంపీగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా విజయవాడ అభివృద్ధికి మద్దతు ఇస్తూనే ఉంటానన్నారు.
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »పొట్ట రాకుండా ఉండేందుకు మన పూర్వీకులు ఏం చేసేవారంటే..?
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు, పెద్దవారు అని వయసుతో సంబంధం లేకుండా ఊబకాయ సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక రకాలైన ఆరోగ్యకర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇందుకు కారణం తీసుకునే ఆహారంలో సరైన పోషకాలు లేకపోవడం. సరైన వ్యాయామాలు లేకపోవడం. మన పూర్వీకులలో చాలా మందికి పొట్ట(ఊబకాయం) సమస్య ఉండదు. అసలు వారు వాడే ఆహార పదార్థాలే వేరు. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన సజ్జలు కీలక పాత్ర వహిస్తాయి. …
Read More »ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో కృష్ణా జిల్లా పరిధిలో ట్రాఫిక్ మల్లింపు : జిల్లా ఎస్పీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమం గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి, ఐటీ పార్క్ వద్ద నిర్వహిస్తున్న సందర్బంగా, ఈ కార్యక్రమానికి గౌరవనీయ దేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు హాజరవుతున్న సందర్బంగా, వాహనదారులు ఎలాంటి ఇబ్బంది పడకుండా, వారి రవాణాకు అంతరాయం ఏర్పడకుండా, పలు ట్రాఫిక్ మళ్లింపు …
Read More »కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీలు..
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు ఎంపీలకు ప్రధాని మోదీ కేబినెట్ లో చోటు దక్కింది. నేడు రాష్ట్రపతి భవన్ లో ప్రధాని మోదీతోపాటు వారు ప్రమాణస్వీకారం చేశారు. శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, వీరికి ఏ శాఖలు కేటాయించారనేది మాత్రం తెలియాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3.27 లక్షల ఓట్ల …
Read More »ఏపీలో వేసవి సెలవులు పొడిగింపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ఒక రోజు పొడిగించింది. పాఠశాలల పునః ప్రారంభ తేదీని వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది. ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13న రాష్ట్రంలోని పాఠశాలల్లో బడిగంట మోగనుంది. 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో.. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. అందుకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది.
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »