Breaking News

All News

అందరికీ పింఛన్లు అందిస్తాం..ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం వెల్లడి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక పింఛన్లు అందరికీ అందజేస్తామని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇంఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హెచ్ఎం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి జిల్లాలో ఏప్రిల్ మాసంకు గాను 2,71,477 మందికి విడుదలైన సామాజిక భద్రత పెన్షన్లలో నేడు ఏప్రిల్ మూడవ తేదీ సాయంత్రం 7 గంటల వరకు 1,16,958 మందికి రూ. 35,40,64,000 పంపిణీ చేశామని తెలిపారు. 43.08 శాతం మందికి అందించామని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో దాదాపుగా అందరికీ అందజేస్తామని అన్నారు. …

Read More »

పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పెన్షన్ పంపిణీ లో భాగంగా తొలి రోజు సుమారు 40 శాతం మంది సామాజిక భద్రత పింఛను దారులకు రూ.29 కోట్ల 26 లక్షల మేర పెన్షన్ సొమ్ము పంపిణీ చేయటం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 2,43,831 మందికి పెన్షన్ లబ్దిదారులకు రూ.72,39,79,500 లు అంద చేయ్యాల్సి ఉండగా బుధవారం రాత్రి 8 గంటల వరకు 95,819 మందికి రూ.29,26,24,000 పంపిణీ చేసినట్లు తెలిపారు. …

Read More »

జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్  కే. మాధవీలత వారి ఆధ్వర్యంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. గోదావరీ వంతెన పరిసర ప్రాంతాల పరిధిలో 500 మీటర్ల దూరం వరకు  ఎటువంటి ఇసుక త్రవ్వకాలు జరపరాదనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఆదేశించారు. అలా జరిపిన యేడల అందుకు ఉపక్రమించిన, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొనబడునని హెచ్చరించారు. 500 మీటర్ల దూరం గుర్తించే ప్రక్రియ …

Read More »

జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణలో రాజకీయ పార్టీలు సహకారం అందించాలి

-ప్రచారం కోసం అనుమతులు తప్పనిసరి -నామినేషన్ పై సందేహాలు నివృత్తి కోసం ప్రత్యేక విభాగం -జిల్లాలో ఎనిమిది చోట్ల చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం -జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నామినేషన్లు నమూనా అఫిడవిట్ నమూనా పత్రాలు అందుబాటు లో ఉంచడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల …

Read More »

హోమ్ ఓటింగు పై నోడల్ అధికారులు, సూపర్ వైజర్, బి ఎల్ వో లతో శిక్షణ కార్యక్రమం

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : హోం ఓటింగు కోసం సమగ్ర ఇంటింటి సందర్శన చేసి ఆకేటగిరి లో ఉన్నటు వంటి ఓటర్లను గుర్తించి, సంభందిత అంగీకార పత్రం పొందడం జరిగిందనీ, హోం ఓటింగ్ నిమిత్తం తీసుకోవలసిన జాగ్రత్తలు, విధి విధానాలు పై పూర్తి స్థాయిలో అవగాహన అవసరమనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో ఉన్న అనపర్తి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో హోమ్ ఓటింగు పై నోడల్ అధికారులు, …

Read More »

ఓటు హక్కును వినియోగించుకోవడం మన బాధ్యత

-ఏప్రిల్ 14 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త : అనపర్తి నియోజక వర్గ పరిధిలో ఉన్న ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు వెయ్యాలనీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, అనపర్తి నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి ఎమ్. మాధురీ విజ్ఞప్తి చేశారు. బుధవారం అనపర్తి లో ఓటర్ల కు ఓటు హక్కు వినియోగించడం పై తేతలి రామిరెడ్డి మంగయ్య అమ్మ కళావేదిక వద్ద నుండి దేవి చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ …

Read More »

పవన్ కళ్యాణ్ ని కలిసిన సుజనా చౌదరి

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా కలిసారు. ఏపిలో మూడు పార్టీల పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషికి సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో దుష్టపాలనని అంతమొందించి, ప్రజాప్రభుత్వం ఏర్పడటం కోసం జనసేన త్యాగాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పొత్తు కోసం తన సొదరుడు పోటీలో నుంచి వైదొలగాల్సి వచ్చినా సిద్ధపడిన పవన్ కళ్యాన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. విజయవాడ …

Read More »

విజ‌య‌వాడ చేరుకున్న ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగమ్

-నగరంలోని నోవాటెల్ వద్ద స్వాగతం పలికిన కలెక్టర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటైర్డు ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులు (స్పెషల్ ఎక్స్ పెన్డిచర్ అబ్జర్వర్)గా ఇటీవ‌ల నియ‌మించింది. మంగళవారం రాత్రి డిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ ఎక్సపెన్డిచర్ అబ్జర్వర్ నీనా నిగమ్ ను నోవాటెల్ వద్ధ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.

Read More »

ఏలూరు లో ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ను పరిశీలించేందుకు మంగళవారం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏలూరు విచ్చేసారు. తొలుత కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. తొలుత మీడియా కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా లో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థకు ( ఏ పి యస్ యస్ డి సి ) ఐఎస్ఓ గుర్తింపు సిబ్బంది సమిష్టి కృషితోనే సాధ్యమయిందన్న నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణాశాఖ ప్రధాన కార్యదర్శి యస్.సురేష్ కుమార్ ఐఏఎస్ ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించడం ద్వారా మరో మైలురాయి చేరామని హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్ఓ) 9001 – 2015 సర్టిఫికెట్ ను గ్లోబల్ మానేజ్మెంట్ సర్టిఫికేషన్ ప్రైవేట్ …

Read More »