-రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, చాలా వరకు శాంతియుతంగా నిర్వహించడంలో కృషిచేసిన ప్రతి ఒక్కరినీ ప్రశంసిస్తూ రాష్ట్ర ప్రధాని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ధన్యవాదాలు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన ఏడు విడతల సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ నేటితో ముగియడంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీ ల కృషికి హృదయపూర్వక ప్రశంసలను తెలియజేస్తూ లేఖ రాశారు. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ …
Read More »Daily Archives: June 1, 2024
భారత ప్రజలమైన మనమంతా ఒకే గొంతుకై ప్రతిధ్వనుంచి ప్రజాస్వామ్య రథ చక్రాలను ముందుకు నడుపుతూ 18వ సాధారణ ఎన్నికలకు ముగింపు పలికాం
-ఎన్నికలను విజయవంతం చేసిన ఓటర్లు, రాజకీయ పార్టీలు, పోలింగ్ యంత్రాంగం మరియు ఈ మహోన్నత కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ భారత ఎన్నికల సంఘం ప్రగాఢ కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశం ఈ రోజు చరిత్ర సృష్టించింది. ఏప్రిల్ 19వ తేదీన మొదటి దశ పోలింగుతో ప్రారంభమై, 7 దశల్లో విస్తరించి, 2024 సాధారణ ఎన్నికలకు పోలింగ్ నేటితో ముగిసింది. 18వ లోక్సభ రాజ్యాంగం కోసం భారతీయ ఓటర్లు తమ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలలో …
Read More »పటిష్ట ప్రణాళిక, సమన్వయంతో కౌంటింగ్ ప్రక్రియ
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు -పటిష్ట భద్రత మధ్య ఓట్ల లెక్కింపు: సీపీ పీహెచ్‌డీ రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన కౌంటింగ్ ప్రక్రియను చేపట్టేందుకు పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం జరిగిందని.. అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించి ఓట్ల లెక్కింపును విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నోవా, నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపునకు చేసిన ఏర్పాట్లు, …
Read More »నేటి పత్రిక ప్రజావార్త :
Read More »అంగరంగ వైభవంగా విజయ కీలాద్రి దివ్య క్షేత్రంపై హనుమాన్ జయంతి ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళా శాసనము లతో విజయకీలాద్రి దివ్యక్షేత్రం లో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాలలో ఆఖరి రోజున శనివారం ఆంజనేయ స్వామికి ఉదయం 9:00 గంటలకు పంచామృతాలతో (తిరుమంజనం) అభిషేకం అనంతరం మన్యసూక్త హోమం , విశేష అలంకరణ , పూర్ణాహుతి, తమలపాకులతో ఆంజనేయ స్వామి వారికీ అష్టోత్తర శతనామార్చన , వడమాలసేవ , అనంతరం మంగళాశాసనం తీర్ధ ప్రసాద గోష్టి తో హనుమాన్ జయంతి …
Read More »జూన్ 12న ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూన్ 12న ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పునరుద్ఘాటించారు. 1-10 తరగతుల విద్యార్థులకు విద్యా సామాగ్రిలో భాగంగా అన్ని సబ్జెక్టుల టెక్స్ట్‌బుక్‌లతో పాటు టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ టెక్స్ట్‌బుక్‌లతో పాటు 3 జతల యూనిఫాంలు, స్కూల్ బ్యాగులు, బెల్ట్,ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు.. అదేవిధంగా 1-5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్‌లు, 6-10 తరగతుల వారికి నోట్‌బుక్‌లు, షూ(బూట్లు) అందజేయబడతాయని ప్రవీణ్ …
Read More »మోకాళ్లనొప్పులకు యోగశక్తి చికిత్స
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 10వ అంతర్జాతీయ యోగా డే సందర్భం గా జరుగుతున్న 21రోజుల అవగాహన-చికిత్స-శిక్షణ కార్యక్రమాలను శనివారం అశోక్ నగర్ ఇండియన్ ఓం లో జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించినట్లు యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భం గా పలువురికి మోకాళ్ళ నొప్పులకు ఆక్యుప్రెషర్, ఆక్యుపంక్చర్ విధానంతో చికిత్స చేసి ఎవరికి వారే చికిత్స చేసుకొనెందుకు పరికరాలను అందచేసినారు. ఈ కార్యక్రమంలో యోగ గురువు బాలసురేష్, ఆక్యుథెరపిస్ట్ లు వెలగపూడి …
Read More »కెరీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి ‘స్టేట్ రిసోర్సు పర్సన్లు’గా ఉపాధ్యాయులకు అవకాశం
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS -ఆసక్తి గల ఉపాధ్యాయులు జూన్ 3 లోపు పేర్లు నమోదు చేసుకోవాలి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్, రోటరీ మరియు ఇండియన్ కెరీర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో కెరీర్ ఎడ్యుకేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ‘స్టేట్ రిసోర్సు పర్సన్లు’గా శిక్షణ పొందడానికి ఆసక్తిగల ఉపాధ్యాయులు పేర్లు నమోదు చేసుకోవాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు IAS ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన …
Read More »ఇంద్రకీలాద్రిపై హనుమాన్ జయంతి కార్యక్రమము
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దేవస్థానం నందు నిర్వహించబడుచున్న హనుమాన్ జయంతి కార్యక్రమములలో భాగముగా శనివారం ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బందిచే అత్యంత వైభవంగా నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించడం జరిగినది. ఈ సందర్భంగా ఆంజనేయస్వామి వారి వద్ద ఈరోజు నిర్వహించిన కార్యక్రమములు- – ఉ.08 గం. ల నుండి మూలమంత్ర జపము, మూలమంత్ర హవనము, మాన్యుసూక్త పారాయణ, సుందరాకాండ …
Read More »ఇంటింటి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఇంటింటి సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ లో 90 శాతం లక్ష్యాలను సాధించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె మాధవీలత శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,42,300 మంది పెన్షన్ లబ్దిదారులు ఉండగా వారిలో ఇంటింటికీ పంపిణి కోసం ప్రత్యేక కేటగిరి పరిధిలోకి వచ్చే వారి కి సంబంధించిన శనివారం రాత్రి 8 గంటల వరకు 67,810 మందికి చెందిన రూ.19.57 కోట్ల కు గానూ 61,002 మందికి రూ.17.62 కోట్ల ను …
Read More »