ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
దేవస్థానం నందు నిర్వహించబడుచున్న హనుమాన్ జయంతి కార్యక్రమములలో భాగముగా శనివారం ఇంద్రకీలాద్రిపై క్షేత్ర పాలకుడిగా ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి ఉత్సవములు వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ వేదపండితులు మరియు అర్చక సిబ్బందిచే అత్యంత వైభవంగా నిర్వహించి, పూర్ణాహుతి సమర్పించడం జరిగినది.
ఈ సందర్భంగా ఆంజనేయస్వామి వారి వద్ద ఈరోజు నిర్వహించిన కార్యక్రమములు-
– ఉ.08 గం. ల నుండి మూలమంత్ర జపము, మూలమంత్ర హవనము, మాన్యుసూక్త పారాయణ, సుందరాకాండ పారాయణ నిర్వహించారు.
– ఉ.09 గం. లకు “పూర్ణాహుతి” నిర్వహించడం జరిగినది.
మరియు దేవస్థానం నకు అనుభందముగా గా ఉన్న దత్తత దేవాలయాములందు కూడా హనుమాన్ జయంతి ఉత్సవములు, పూజా కార్యక్రమములు నిర్వహించడం జరిగినది.
Prajavartha Online Telugu News